Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

ఐపీఎల్ 2020: ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!

IPL 2020, ఐపీఎల్ 2020: ఫ్రాంచైజీలకు షాక్ ఇవ్వనున్న బీసీసీఐ!

ఐపీఎల్ 2020 వేలంలో కొన్ని సర్‌ప్రైజ్‌లు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఆసీస్ ఆల్‌రౌండర్ పాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కేకేఆర్ 15.50 కోట్లతో ఈ ఆస్ట్రేలియన్ స్టార్ ప్లేయర్‌ను కొన్న విషయం తెలిసిందే. ఒక్క కమ్మిన్స్ మాత్రమే కాదు.. గ్లెన్ మాక్స్‌వెల్, క్రిస్ మోరిస్, నాథన్ కౌల్టర్‌నైల్. షెల్డన్ కాట్రేల్ కూడా వేలంలో అత్యధిక ధరలకు అమ్ముడైయ్యారు.

ఇదిలా ఉంటే.. మార్టిన్ గప్తిల్, బెన్ కటింగ్, టిమ్ సౌథీ, ఆడమ్ జాంప, ముస్తాఫిజుర్ రెహమాన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లపై ఈ వేలంలో ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు విశ్లేషకులకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఐపీఎల్ వేలం ముగిసింది. ఇప్పుడు అందరి కళ్ళు టోర్నమెంట్‌పై ఉంది. బీసీసీఐ కూడా త్వరలోనే తేదీలను ప్రకటించనుంది. అయితే తాజాగా ఐపీఎల్ 2020 స్టార్టింగ్ డేట్‌పై ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇక అది కాస్తా ఫ్రాంచైజీలను గాబరా పెడుతోంది. దేనికో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ ఆరంభం మిస్ కానున్న స్టార్ ప్లేయర్స్…

మార్చి 28న ఐపీఎల్ మొదలుపెట్టాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. ఒకవేళ ఇదే ఫైనల్ అయితే చాలామంది స్టార్ ఆటగాళ్లు ఆరంభ మ్యాచులు మిస్ కానున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక ప్లేయర్స్ అందరూ కూడా స్టార్టింగ్ మ్యాచులకు అందుబాటులో ఉండరు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్.. అదే విధంగా ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య టెస్ట్ సిరీస్ మార్చి 28 నుంచే మొదలు కానున్నాయి. ఒకవేళ బీసీసీఐ ఏప్రిల్ మొదటి వారంలో టోర్నమెంట్ మొదలుపెట్టాలని చూసినా.. ఈ ఆటగాళ్లు రెండు, మూడు మ్యాచులు మిస్ కావడం గ్యారంటీ.

ఫ్రాంచైజీల వారీగా ఆరంభ మ్యాచులు మిస్ కానున్న ప్లేయర్స్ వీరే..

కోల్‌కతా: పాట్ కమ్మిన్స్

పంజాబ్: గ్లెన్ మాక్స్‌వెల్

సన్‌రైజర్స్: కేన్ విలియమ్సన్, డేవిడ్ వార్నర్

రాజస్థాన్ : స్టీవ్ స్మిత్, జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్

Related Tags