Sangeeta Bajrang Wedding: భారత రెజ్లర్లు బజరంగ్ పునియా, సంగీతా ఫొగట్‌ల వివాహం ఘనంగా జరిగింది. గురువారం వీరి వివాహం జరగ్గా.. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియాలో వెల్లడించారు. తాము వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు 2019లో వెల్లడించిన ఈ జంట.. తాజాగా ఒక్కటయ్యారు.
ఇక తమ పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన సంగీత.. ”నీ వలన నా జీవితం పరిపూర్ణమైంది. నా జీవితానికి నువ్వే సోల్‌మేట్‌వి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని సంతోషంగా మొదలుపెట్టబోతున్నా” అని కామెంట్ పెట్టారు. మరోమైపు తామిద్దరి పెళ్లి ఫొటోను షేర్ చేసుకున్న బజరంగ్ పునియా.. ”పెళ్లి అన్నది ఒక గొప్ప సంప్రదాయం. నా జీవిత భాగస్వామిని ఇవాళ తన ఇంటి నుంచి మా ఇంటికి తీసుకెళ్తున్నా. నాకు మరో కుటుంబం లభించినట్లుగా ఉంది. నా జీవితంలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతున్నా. చాలా సంతోషంగా ఉంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులకు థ్యాంక్స్” అని కామెంట్ పెట్టారు. ఇక ఈ ఇద్దరికి భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, రాణీ రాంపాల్ సమా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.