World Masters Athletics: విదేశాల్లో అదరగొట్టిన బామ్మ.. 94 ఏళ్ల వయసులో ఏకంగా 3 మెడల్స్ సాధించి..

|

Jul 11, 2022 | 6:04 PM

World Masters Athletics Championships 2022: 94 ఏళ్ల వయసు అంటే సాధారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. వారి పని వారు..

World Masters Athletics: విదేశాల్లో అదరగొట్టిన బామ్మ.. 94 ఏళ్ల వయసులో ఏకంగా 3 మెడల్స్ సాధించి..
Athlets
Follow us on

World Masters Athletics Championships 2022: 94 ఏళ్ల వయసు అంటే సాధారణంగా కనీసం నడవలేని స్థితిలో ఉంటారు. వారి పని వారు కూడా చేసుకోలేని స్థితిలో ఉంటారు. ఈ వయసు వారిని విశ్రాంతి తీసుకోవాలిన సూచిస్తుంటారు. కానీ, ఈ బామ్మ మాత్రం.. వయసు అంకెలకే, శరీరానికి కాదని చాటిచెప్పింది. వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్కస్ ఛాంపియన్‌షిప్‌ 2022లో ఏకంగా ఒక స్వర్ణం సహా 3 పథకాలను సాధించి ఇండియా కీర్తిప్రతిష్టలను మరింత పెంచింది. ఆమె ఒక స్పోర్ట్స్‌లో కాదు.. 3 విభాగాల్లో 3 పథకాలను గెలవడం విశేషం.

భారత అథ్లెట్ భగవాన్ దేవి దాగర్(94) ఫిన్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 2022లో సీనియర్ సిటిజన్స్ విభాగంలో పోటీ పడింది. స్వర్ణంతో సహా 3 పథకాలను సాధించింది. భగవాద్ దేవి 100 మీటర్ల పరుగుపందెంలో స్వర్ణం సాధించింది. ఈ రేసును కేవలం 24.74 సెకన్లలో పూర్తి చేసి ఔరా అనిపించింది. ఇక షాట్‌పుట్‌లో కాంస్యం, జావెలిన్‌లోనూ కాంస్యం సాధించింది.

వయసు అడ్డుకాదు..
ఈ సీనియర్ సిటిజన్ అథ్లెట్‌ భగవానీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ అభినందించింది. విజయానికి వయసు అడ్డంకి కాదని ఆమె మరోసారి నిరూపించారని ప్రశించింది. కాగా, భగవానీ దేవి ఇంతకుముందు ఢిల్లీ స్టేట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల రేసు, షాట్‌పుట్, జావెలిన్‌లో 3 బంగారు పతకాలు సాధించినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ పేర్కొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..