Women’s Asia Cup : మహిళల ఆసియా కప్ లో ఫైనల్స్ చేరిన భారత్.. ప్రత్యర్థి పై ఉత్కంఠ..

|

Oct 13, 2022 | 12:57 PM

తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. థాయ్‌లాండ్‌ తరఫున కెప్టెన్‌ నరుఎమోల్‌ చైవై..

Womens Asia Cup : మహిళల ఆసియా కప్ లో ఫైనల్స్ చేరిన భారత్.. ప్రత్యర్థి పై ఉత్కంఠ..
India Womens Cricket Team
Follow us on

మహిళల ఆసియా కప్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 13వ తేదీ గురువారం బంగ్లాదేశ్ వేదికగా జరిగిన సెమి ఫైనల్స్ మ్యాచ్ లో పసికూన థాయ్ లాండ్ ను ఓడించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు దూసుకెళ్లింది. భారత్ 74 పరుగుల తేడాతో థాయ్‌లాండ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన థాయ్ లాండ్ భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 74 పరుగులు మాత్రమే చేయగలిగింది. థాయ్‌లాండ్‌ తరఫున కెప్టెన్‌ నరుఎమోల్‌ చైవై, నట్టయా బూచతమ్‌ లు తలో 21 పరుగులు చేయగా, భారత బౌలర్ దీప్తి శర్మ నాలుగు ఓవర్లు వేసి 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిలకడగా ఆడుతూ వచ్చింది. అయితే షఫాలీ వర్మ 28 బంతుల్లో 42 పరుగులు చేయగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36, జెమిమా రోడ్రిగ్స్ 27 పరుగులు చేశారు. థాయ్‌లాండ్‌ తరఫున సోర్నారిన్ టిప్పోచ్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి థాయిలాండ్ టీమ్ లో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఫైనల్స్ లో భారత మహిళల జట్టు ఎవరితో తలపడుతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం పాకిస్తాన్- శ్రీలంక జట్టు సెమిఫైనల్స్-2 లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్స్ చేరకుంటుంది. అయితే పాకిస్తాన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నప్పటికి, శ్రీలంక పాకిస్తాన్ ను ఎలా ఎదుర్కొంటుందనేది చూడాల్సి ఉంది. అయితే శ్రీలంక కనుక ప్రత్యర్థి అయితే ఫైనల్స్ లో భారత్ కు విజయవకాశాలు మెండుగా ఉంటాయి. అదే పాకిస్తాన్ అయితే మాత్రం గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇటీవల ఓ మ్యాచ్ లో భారత జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించింది. దీంతో భారత్- పాకిస్తాన్ ఫైనల్స్ లో ప్రత్యర్థులైతే మాత్రం మ్యాచ్ పై తీవ్ర ఉత్కంఠ నెలకొనే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

థాయ్‌లాండ్‌ తో జరిగిన సెమిఫైనల్ మ్యాచ్ లో 148 పరుగులు చేసి ప్రత్యర్థికి 149 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అయితే లక్ష్య చేధన ప్రారంభించిన థాయ్‌లాండ్ జట్టును భారత బౌలర్‌ దీప్తి శర్మ ఆరంభంలోనే దెబ్బతీసింది. మూడో ఓవర్లో దీప్తి వేసిన ఐదో బంతిని ఓపెనర్‌ కొంచారోయింకై షాట్‌కు ప్రయత్నించగా.. షఫాలీ వర్మ అద్భుతమైన క్యాచ్‌ పట్టింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే మరో మూడు వికెట్లను కోల్పోయిన థాయ్ లాండ్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ తర్వాత నరూమోల్‌ చైవై, నట్టాయ బూచతమ్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా పెద్దగా ఫలితం లేకపోయింది. భారత బౌలర్ల ధాటికి ప్రత్యర్థి జట్టు వికెట్ల పతనం ఆగలేదు. దీంతో 74 పరుగులకే థాయ్ లాండ్ ఆలౌటైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..