India vs England: ప్రపంచంలోనే అతిపెద్దదిగా అహ్మదాబాద్ స్టేడియం.. దాని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

|

Feb 22, 2021 | 3:45 PM

India vs England 2021: మరో రెండు రోజుల్లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం సర్దార్ పటేల్ స్టేడియం సర్వం సిద్ధమైంది.

India vs England: ప్రపంచంలోనే అతిపెద్దదిగా అహ్మదాబాద్ స్టేడియం.. దాని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
Follow us on

India vs England 2021: మరో రెండు రోజుల్లో భారత్-ఇంగ్లండ్ మధ్య జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ కోసం సర్దార్ పటేల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. ఈ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లో పింక్‌బాల్‌ను వినియోగించనున్నారు. ఇదిలా ఉంటే.. తొలిసారి డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తున్న సర్దార్ పటేల్ స్టేడియానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొంది. దాదాపు 63 ఎకరాల్లో ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఈ స్టేడియంలో ఒకేసారి 1.1 లక్షల మంది ప్రేక్షకులు మ్యాచ్‌ను వీక్షించే అవకాశం ఉంది. అంతేకాదు.. ఈ స్టేడియంలో అధునాతన సౌకర్యాలు ఉన్నాయి. ఒకవేళ వర్షం కారణంగా స్టేడియంలోకి వచ్చినట్లయితే.. ఆ వర్షపు నీటిని 30 నిమిషాల్లో బయటకు పంపే ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ స్టేడియంలో 76 కార్పొరేట్ బాక్స్‌లు, నాలుగు టీమ్ డ్రెస్సింగ్ రూములు ఉన్నాయి. ఇంకా, 40 మంది అథ్లెట్లకు సరిపడా వసతి గృహాలతో కూడిన ఇండోర్ క్రికెట్ అకాడమీ కూడా ఈ స్టేడియంలో ఉంది.

ఇదిలాఉంటే.. మొతేరాలో జరిగే పింక్‌ బాల్‌ టెస్ట్‌ కోసం కోహ్లీ సేన ముమ్మర సాధన చేస్తోంది. 2019లో ఈడెన్‌ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో పింక్‌ బాల్‌ టెస్ట్‌ ఆడిన టీమిండియా.. ఆ తరువాత జరుగుతున్న రెండో మ్యాచ్ ఇదే కావడం విశేషం. కాగా, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌ కోసం భారత్‌ జట్టు స్వింగయ్యే పింక్‌ బంతులతో నెట్స్‌లో తీవ్రంగా శ్రమించింది. నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో తొలి రెండు టెస్టులు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచుల్లోనూ.. మొదటి మ్యాచ్ ఇంగ్లండ్‌ నెగ్గగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. దాంతో 1-1తో సిరీస్‌ సమంగా ఉంది. ఇక ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మూడు టెస్ట్ మ్యాచ్(డే/నైట్) జరగనుంది.

Also read:

ఆ ముగ్గురికి అదృష్టం పట్టింది.. ఈ ముగ్గురి ఖేల్ ఖతం.! వారెవరంటే.!!

మూడో టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమైన సర్ధార్ పటేల్ స్టేడియం.. ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్..!