Women’s Asia Cup 2022: ఫైనల్స్ చేరిన ఆనందంలో గ్రౌండ్ లో డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెటర్లు.. నిరాశలో ఆ జట్టు..

|

Oct 14, 2022 | 11:35 AM

థాయ్ లాండ్ పై గెలుపుతో భారత మహిళల జట్టు ఫైనల్స్ లోకి ప్రవేశించగా.. పాకిస్తాన్ జట్టును ఓడించి శ్రీలంక జట్టు కూడా ఫైనల్స్ చేరింది. పాకిస్తాన్ పై విజయం తర్వాత ఆనందంతో..

Womens Asia Cup 2022: ఫైనల్స్ చేరిన ఆనందంలో గ్రౌండ్ లో డ్యాన్స్ తో అదరగొట్టిన క్రికెటర్లు.. నిరాశలో ఆ జట్టు..
Srilanka Womens Cricket Team
Follow us on

మహిళల ఆసియా కప్ తుది దశకు చేరుకుంది. అక్టోబర్ 15వ తేదీ శనివారం జరిగే ఫైనల్స్ మ్యాచ్ లో భారత్- శ్రీలంక తలపడనున్నాయి. ఒక సెమిఫైనల్స్ మ్యాచ్ లో థాయ్ లాండ్ పై గెలుపుతో భారత మహిళల జట్టు ఫైనల్స్ లోకి ప్రవేశించగా.. పాకిస్తాన్ జట్టును ఓడించి శ్రీలంక జట్టు కూడా ఫైనల్స్ చేరింది. పాకిస్తాన్ పై విజయం తర్వాత ఆనందంతో శ్రీలంక ఆటగాళ్లు గ్రౌండ్ లోనే అద్భుతమైన డ్యాన్స్ తో అదగొట్టారు. మహిళల ఆసియా కప్‌ సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో పాకిస్థాన్‌ను శ్రీలంక ఒక్క పరుగు తేడాతో ఓడించి భారత్‌తో టైటిల్ పోరుకు సిద్ధమైంది. అక్టోబర్ 13వ తేదీ గురువారం జరిగిన మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ను ఒక్క పరుగు తేడాతో ఓడించి భారత్‌తో టైటిల్ పోరుకు శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు రెడీ అయింది.

భారత్ జట్టునే ఓడించిన పాకిస్తాన్ పై శ్రీలంక గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. చివరికి శ్రీలంక కూడా పాకిస్తాన్ ఛేజింగ్ ను ఆరంభించిన తీరును బట్టి తాము గెలుస్తామని ఊహించి ఉండదు. ఉత్కంఠ పోరులో శ్రీలంక మహిళల జట్టును విజయం వరించడంతో ఆ జట్టు గ్రౌండ్ లోనే ఎగిరి గంతేసింది. టీమ్ మొత్తం డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపింది. తమ ఆనందాన్ని డ్యాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నారు. పాకిస్తాన్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 122 పరుగులు చేసింది. 123 పరుగుల విజయలక్ష్యంతో చేధన ఆరంభించిన పాకిస్తాన్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. మూడు ఓవర్లలోనే 31 పరుగులు చేసింది పాకిస్తాన్ జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఆటగాళ్లు విఫలమవ్వడంతో పాకిస్తాన్ 1పరుగుతో ఓటమి చవిచూసింది.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్‌కు చెందిన బౌలర్ ష్రా సంధు మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. చేధనలో పాకిస్తాన్ విఫలం కావడంతో శ్రీలంక ఫైనల్ బెర్త్ ను ఖరారు చేసుకుంది. సెమీ ఫైనల్స్ మ్యాచ్ లో విజయం తర్వాత శ్రీలంక ఆటగాళ్లు అంతా కలిసి గ్రౌండ్ లో డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక పరుగుతో ఓడిపోయి ఆసియా కప్ ఫైనల్స్ చేరే అవకాశం కోల్పోవడంతో పాకిస్తాన్ జట్టు నిరాశతో డ్రెస్సింగ్  రూమ్ కు వెనుదిరిగింది.

మరిన్ని  క్రీడా వార్తల కోసం చూడండి..