వీరేంద్రుడిని… బీసీసీఐ కరుణిస్తుందా!

| Edited By:

Aug 13, 2019 | 5:36 PM

భారత్ హెడ్ కోచ్‌ పోస్ట్‌ కోసం రెండేళ్ల క్రితం పోటీపడి కంగుతిన్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా సెలక్టర్‌ పదవిపై కన్నేసినట్లు ఉన్నాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని సీజన్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ టీమ్‌తో కలిసి పనిచేసిన సెహ్వాగ్.. ప్రస్తుతం మ్యాచ్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. తాజాగా తనకి సెలక్టర్ కావాలని ఉందని.. ఎవరైనా అవకాశమిస్తారా..? అంటూ సరదాగా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌పై అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. […]

వీరేంద్రుడిని... బీసీసీఐ కరుణిస్తుందా!
Follow us on

భారత్ హెడ్ కోచ్‌ పోస్ట్‌ కోసం రెండేళ్ల క్రితం పోటీపడి కంగుతిన్న మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. టీమిండియా సెలక్టర్‌ పదవిపై కన్నేసినట్లు ఉన్నాడు. క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కొన్ని సీజన్లు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ టీమ్‌తో కలిసి పనిచేసిన సెహ్వాగ్.. ప్రస్తుతం మ్యాచ్ కామెంటేటర్‌గా కొనసాగుతున్నాడు. అయితే.. తాజాగా తనకి సెలక్టర్ కావాలని ఉందని.. ఎవరైనా అవకాశమిస్తారా..? అంటూ సరదాగా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌పై అభిమానుల నుంచి మద్దతు లభిస్తోంది. ‘మీకు బీసీసీఐ సెలక్షన్‌ ప్యానల్‌ పని చేసే అవకాశం రావాలి’ అని ఒక అభిమాని ట్వీట్‌ చేయగా, ‘ సెహ్వాగ్‌కు సెలక్టర్‌గా చేసే అవకాశం ఇవ్వాలి’ అని మరొకరు కోరారు. ‘ మీరు సెలక్టరైతే భారత క్రికెట్‌ జట్టులో కొత్త ఉత్సాహం వస్తుంది’ అని మరొక అభిమాని ట్వీట్‌ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్లలో ఒకడిగా పేరుగాంచిన సెహ్వాగ్ తన అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించాడు. 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించడం ద్వారా భారత తరుపున ఈ ఘనత సాధించిన అరుదైన క్రికెటర్‌గా నిలిచాడు. తన టెస్టు కెరీర్‌లో 104 టెస్టులు ఆడి 8,586 పరుగులు సాధించాడు. అందులో 23 సెంచరీలు, 32 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్‌ అత్యధిక స్కోరు 319. ఇక వన్డేల్లో 251 మ్యాచ్‌లు ఆడి 8,273 పరుగులు సాధించాడు. వన్డేల్లో అతని అత్యధిక స్కోరు 219. 19 అంతర్జాతీయ టీ20ల్లో 394 పరుగులు చేశాడు.