ప్రపంచ క్రికెట్లో మిస్టర్ దూకుడుగా పేరొందిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో రికార్డుల పంట పండుతోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లీ మరో మూడు రికార్డులు బద్దలు కొట్టాడు. ఈసారి ఏకంగా క్రికెట్ దేవునిగా యావత్ ప్రపంచం పిలుచుకునే కంగారూ కింగ్ డాన్ బ్రాడ్ మన్ రికార్డును ఛేదించాడు టీమిండియా కెప్టెన్. బ్రాడ్ మన్ తన టెస్టు క్రికెట్ కెరీర్లో మొత్తం ఎనిమిది సార్లు 150కి పైగా పరుగులు చేయగా.. శుక్రవారం పుణె టెస్టులో డబుల్ సెంచరీ సాధించే క్రమంలో విరాట్ కొహ్లీ ఏకంగా తొమ్మిది సార్లు 150కి పైగా పరుగులు చేసి, డాన్ బ్రాడ్ మన్ రికార్డును తిరగరాశాడు.
అదే క్రమంలో ఏడుసార్లు డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు విరాట్. అదే క్రమంలో ఈ టెస్టులో 254 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు టీమిండియా కెప్టెన్. ఈ రెండు రికార్డులే కాకుండా.. మరో రెండు రికార్డులను అధిగమించాడు కొహ్లీ.
అంతర్జాతీయ క్రికెట్‌లో 40 సెంచరీలు చేసిన భారతీయ కెప్టెన్ గా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండవ టెస్టులో కోహ్లీ సూపర్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో కోహ్లీకి ఇది 26వ సెంచరీ కావడం విశేషం. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీల సంఖ్య మొత్తం 69కి చేరుకున్నది. ఇండియా పిచ్‌లపై కోహ్లీకి ఇది 12వ టెస్టు సెంచరీ. అయితే కెప్టెన్‌గా కోహ్లీ ఇప్పటి వరకు 40 సెంచరీలు చేశాడు.
మొదటి స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఉన్నాడు. కెప్టెన్‌గా పాంటింగ్ 41 సెంచరీలు చేశాడు. గత పది టెస్టు ఇన్నింగ్స్‌ల్లో స్వల్ప స్కోర్లకే ఔటైన విరాట్ కోహ్లీ.. పుణె పిచ్‌పై మాత్రం చెలరేగాడు. డబుల్ సెంచరీ దిశగా కోహ్లీ ఇన్నింగ్స్ వెళ్తోంది. తొలుత అజింక్య రహానే, ఆ తర్వాత రవీంద్ర జడేజాల సహకారంతో ఇన్నింగ్స్ను బిల్డప్ చేసిన కొహ్లీ… ఈ టెస్టులో ద్విశతకం సాధించడం ద్వారా మరో ఫీట్ చేజిక్కించుకున్నాడు. కెప్టెన్ హోదాలో డబుల్ సెంచరీ చేసిన విరాట్ కొహ్లీ… కెప్టెన్ గా వ్యవహరిస్తూ ఈ ఫీట్ సాధించిన బ్రియన్ లారా, గ్రేమ్ స్మిత్ ల సరసన నిలిచాడు విరాట్ కొహ్లీ.