భారత టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ(Virat Kohli) శనివారం వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికా(India vs South Africa)తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 తేడాతో ఓడిపోయింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup 2021)కు ముందు టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. దీంతో సెలక్టర్లు అతడిని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించారు. ప్రస్తుతం టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి కూడా కోహ్లీ(Virat Kohli Steps Down as Captain) తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చాడు.
ఇటీవలి కాలంలో, విరాట్ తన ఒక్కో ఫార్మాట్ నుంచి క్రమంగా దూరమవుతున్నాడు. విరాట్ ఐపీఎల్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా కూడా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోహ్లీ సారథిగా తన జట్టుకు ఒక్క టైటిల్ కూడా అందించలేకపోయాడు. ఐపిఎల్-2021 తర్వాత విరాట్ ఆర్‌సీబీ జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు.
— Virat Kohli (@imVkohli) January 15, 2022