దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో భారత్ ఓటమి చవిచూసింది. వర్షం కారణంగా లక్నో వేదికగా అక్టోబర్ 6వ తేదీ గురువారం జరిగిన మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 249 పరుగులు చేసింది. 250 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 240 పరుగులు మాత్రమే చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 9 పరుగుల తేడాతో గెలిచింది. టీ20 ప్రపంచకప్ కారణంగా భారత్ ద్వితీయశ్రేణి జట్టుతోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరస్ ఆడుతోంది. 51 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ 240 పరుగులు చేయడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ లో ఓడిపోయినప్పటికి సంజు బ్యాటింగ్ శైలిపై క్రికెట్ దిగ్గాజాలే కాకుండా క్రికెట్ అభిమానులు సైతం ట్విట్టర్ వేదికగా ప్రసంశల జల్లు కురిపిస్తున్నారు. తొలి వన్డేలో సంజూ శాంసన్ 86 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీ20 ఫార్మట్ లో వేగంగా ఆడి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయగల సామర్థ్యం సంజు శాంసన్ కు ఉంది. అయితే వన్డే కేరీర్ లో మాత్రం అతడికి పెద్దగా రికార్డులు లేవు. అయితే క్రీజులో నిలదొక్కుకుని ఆడితే మాత్రం మంచి ఇన్నింగ్స్ ఆడగలడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో వరుసగా వికెట్లు పడిపోవడంతో.. మొదట్లోనే హిట్టింగ్ చేయకుండా.. క్రీజులో నిలదొక్కుకుని చివరిలో హిట్టింగ్ చేశాడు. దీంతో మ్యాచ్ ను చివరి బాల్ వరకు తీసుకెళ్లగలిగాడు. మ్యాచ్ పై భారత క్రికెట్ అభిమానులు ఆశలు వదులుకున్న తరుణంలో 63 బంతుల్లో 86 పరుగులు చేసిన సంజు శాంసన్ మళ్లీ గెలవచ్చనే ఆశలు రేకెత్తించాడు.
ఆతిథ్య భారత్‌కు చివరి ఓవర్ లో 30 పరుగులు అవసరం కాగా, షమ్సీ మొదటి బంతిని వైడ్ గా వేశాడు. ఆ తర్వాత 3 బంతుల్లో ఒక సిక్స్ రెండు ఫోర్లతో 14 పరుగులు చేయడంతో మొదటి మూడు బంతుల్లోనే 15 పరుగులు వచ్చాయి. చివరి మూడు బంతుల్లో 15 పరుగులు అవసరం కాగా.. నాలుగో బంతికి పరుగులు రాకపోవడంతో మ్యాచ్ పై ఆశలు వదులుకోవల్సి వచ్చింది. ఐదో బంతిని ఫోర్ గా కొట్టగా, ఆరో బంతికి సింగిల్ మాత్రమే తీశాడు. అయితే 86 పరుగులు చేసిన శాంసన్ నాటౌట్ గా నిలిచాడు. దీంతో సంజు శాంసన్ ఆడిన నాక్‌ను చాలా మంది ట్విట్టర్‌లో ప్రశంసించారు. మ్యాచ్ అనంతరం, దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ శాంసన్ ను అభినందిస్తూ.. యువరాజ్ సింగ్ లా సిక్సర్లు కొట్టే సత్తా ఉందన్నాడు. ఇదే సమయంలో కగిసో రబాడ 19వ ఓవర్ చివరి బంతిని నో బాల్ గా వేయడంతో ఇలాంటివి జరగకూడదని తాను అనుకున్నానని అన్నారు. సంజు శాంసన్ లాంటి బ్యాట్స్ మెన్ కు అవకాశమిస్తే అసలు వదులకోరన్నారు. ఐపీఎల్ లో తనను నేను చూశానని, బౌలర్లపై బ్యాట్ తో విరుచుకునడటం అతడి సహజ లక్షణమని డేల్ స్టెయిన్ అభిప్రాయపడ్డాడు. చివరి రెండు ఓవర్లలో శాంసన్ కొట్టిన బౌండరీలు ఎంతో అద్భుతమన్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత సంజు శాంసన్ మాట్లాడుతూ.. క్రీజులో కొంత సేపు నిలదొక్కుకోవడం ద్వారా జట్టును విజయం వైపు తీసుకెళ్లడానికి అవకశం ఉంటుందన్నాడు. తాను రెండు బంతులను కనెక్ట్ చేయలేకపోయానని, వచ్చే మ్యాచుల్లో మరింత బాగా రాణించడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. మొదటి వన్డేలో తన ఆటతీరుపట్ల సంతృప్తిగా ఉందని శాంసన్ చెప్పాడు.
Came in at 51/4. Finished with 86* off 63. Gave the nation hope.
Proud of you, Sanju Samson. ??? pic.twitter.com/Pp0kix7PoR
— Rajasthan Royals (@rajasthanroyals) October 6, 2022
That was a valiant effort from Sanju Samson. Tough luck but a very high quality innings.
— Virender Sehwag (@virendersehwag) October 6, 2022
Top class from sanju Samson, very aggressive, very impressive, you deserve the applause!! @IamSanjuSamson
— Mohammad Kaif (@MohammadKaif) October 6, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..