Vinesh Phogat: టోక్యో ప్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ ఫొగెట్.. సమస్య పరిష్కారం అయిందంటున్న ఐఓఏ

|

Jul 28, 2021 | 1:06 PM

Tokyo Olympics 2021 Vinesh Phogat: భారత్ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ పొగాట్ ఒలంపిక్స్ వేదికైన టోక్యో ప్లైట్ ను మిస్ చేసుకుంది. ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొనడానికి ముందు..

Vinesh Phogat: టోక్యో ప్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ ఫొగెట్.. సమస్య పరిష్కారం అయిందంటున్న ఐఓఏ
Vinesh Phogat
Follow us on

Tokyo Olympics 2021 Vinesh Phogat: భారత్ స్టార్ మహిళా రెజ్లర్ వినేష్ పొగాట్ ఒలంపిక్స్ వేదికైన టోక్యో ప్లైట్ ను మిస్ చేసుకుంది. ఒలంపిక్స్ పోటీల్లో పాల్గొనడానికి ముందు తన కోచ్ వోలెట్ అకోస్‌తో కలిసి శిక్షణ నిమిత్తం హంగేరీ వెళ్ళింది.. అయితే యూరోపియన్యూనియన్ వీసా గడువుకంటే ఒక్కరోజు ఎక్కువగా ఉంది. దీంతో మంగళవారం టోక్యో వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ కు వచ్చిన వినేష్ ను అక్కడ అధికారు అడ్డుకున్నారు. దీంతో వినేష్ ఎక్కాల్సిన ప్లైట్ వెళ్ళిపోయింది. దీంతో వినేష్ హంగేరీలోనే ఉండిపోవాల్సి వచ్చింది.

వెంటనే ఈ విషయంపై ఇండియ‌న్ ఒలింపిక్ అసోసియేష‌న్(ఐవోఏ) స్పందించింది. రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించింది. . వినేష్ బుధ‌వారం టోక్యో వెళ్తుంద‌ని ఐవోఐ స్పష్టం చేసింది. వినేష్ ఇది కావాలని చేసింది కాదని.. వీసా గడువు సరిగా చూడకపోవడంతో జరిగిన పొరపాటని తెలిపింది. వినేష్ హంగేరీలో 90 రోజులు ఉండదని వీసా గడువు ఉండగా.. ఆమె ఫ్రాంక్‌ఫ‌ర్ట్ చేసే స‌రికి91 రోజులు అయ్యిందని తెలిపింది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ భారత్ దృష్టికి వచ్చిన వెంటనే.. జర్మనీలోని ఇండియ‌న్ కాన్సులేట్‌కు సమాచారాన్ని అందించారు. మంగళవారం రాత్రి ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌లోనే ఉన్న వినేష్‌కు మ‌రోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు చేశారు. బుధ‌వారం టోక్యోలో ల్యాండైన త‌ర్వాత మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వహించనున్నారు.

ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్లలో ఎన్నో పతకాలు గెలిచిన వినేష్‌పై భారీ అంచనాలున్నాయి. ఈసారి ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో గోల్డ్ మెడ‌ల్ తెస్తుంద‌ని అందరూ భావిస్తున్నారు. స్టార్ రెజ్లర్ గా 53 కేజీల ఉమెన్ ఫ్రీస్టైల్ కేటగిరీలో పోటీ పడుతుంది వినేష్

Also Read:  విజేతలూ మెడల్స్ కొరకవద్దు అంటున్న ఒలంపిక్స్ నిర్వాహకులు.. అసలు అథ్లెట్స్ ఎందుకు కోరుకుతారో తెలుసా