Javelin Throw Finals: బిగ్ ఫైట్‌కు వేదికగా టోక్యో.. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పాక్ క్రీడాకారుడుతో తలపడనున్న నీరజ్..

Javelin Throw Finals: జావెలిన్ థ్రో.. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారత్.. పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించింది. ఇది సరికొత్త రికార్డ్. ఈ ఈవెంట్‌లో భారత్‌కు..

Javelin Throw Finals: బిగ్ ఫైట్‌కు వేదికగా టోక్యో.. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో పాక్ క్రీడాకారుడుతో తలపడనున్న నీరజ్..
Javelin Throw

Updated on: Aug 07, 2021 | 2:11 PM

Javelin Throw Finals: టోక్యో ఒలింపిక్స్ లో 16 వ రోజు భారత్ ఆటగాళ్లకు చివరి రోజు.. ఈరోజు మూడు పతకాలు వస్తాయని భావించిన సమయంలో గోల్ఫర్ అదితి చివరి నిమిషంలో తడబడి నాలుగో స్థానానికి పరిమితమయ్యింది. భారత్ ఖాతాలో మరో పతకం చేరుతుంది అనుకుంటున్న ఈవెంట్ జావెలిన్ థ్రో.. ఇప్పటి వరకూ ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారత్.. పురుషుల జావెలిన్ థ్రో విభాగంలో ఫైనల్స్‌కు భారత్ అర్హత సాధించింది. ఇది సరికొత్త రికార్డ్. ఈ ఈవెంట్‌లో భారత్‌కు ప్రాతినిథ్యాన్ని వహించిన నీరజ్ చోప్రా సాయంత్రం 4. 30 నిమిషాలకు ఫైనల్స్ ఆడనున్నాడు. తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

నీరజ్ చోప్రా క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఒత్తిడికి అందకుండా..బరిలోకి దిగాడు.. దుమ్ము దులిపాడు. తొలి ప్రయత్నంలోనే అతను ఏకంగా 86.65 మీటర్ల దూరం వరకు జావెలిన్‌ను సంధించాడు. ఈ విభాగంలో పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలిచాడు. ఇదీ రికార్డే.

ఫస్ట్ అటెంప్ట్‌లోనే నీరజ్ రికార్డ్ స్థాయి దూరానికి జావెలిన్‌ను సంధించాడు. గ్రూప్-ఏ విభాగంలో అతనే టాపర్. భారత్‌ను తొలి స్థానంలో నిలిపాడు నీరజ్ చోప్రా. ఈ కేటగిరీలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీ, ఫిన్లాండ్ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి.

అయితే పురుషుల జావెలిన్ థ్రో విభాగం గ్రూప్-ఏలో నీరజ్ చోప్రా తొలి స్థానంలో నిలవగా.. గ్రూప్-బీలో పాకిస్తాన్ ప్లేయర్ మొదటి ప్లేస్ లో నిలిచాడు. పాకిస్తాన్ జావెలిన్ థ్రయోర్ అర్షద్ నదీం.. గ్రూప్-బీలో మొదటి స్థానంలో ఉన్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో అర్షద్ 85.16 మీటర్ల దూరం పాటు జావెలిన్‌ను విసిరాడు. దీంతో ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో.. నీరజ్, అర్షద్ లు వేర్వేరు గ్రూపుల్లో ఉండటం వల్ల తారసపడలేదు. ఫైనల్స్‌లో మాత్రం పరిస్థితి అలా ఉండదు. క్వాలిఫై అయిన థ్రయోర్లందరూ ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో ప్రపంచ కప్ లో ఏ విధంగా పాకిస్తాన్ ను భారత్ ఓడిస్తుందో.. అదే విధంగా ఇప్పుడు నీరజ్ .. అర్షద్ ను ఓడించి పతకం సాధించాలని క్రీడాభిమానులు కోరుకుంటున్నారు.

Also Read: మీరు ఎటువైపు తిరిగి నిద్రపోతున్నారు.. ఎడమవైపు తిరిగి నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

పతకం సాధింకపోతేనేమి.. చరిత్ర సృష్టించావంటూ అదితి అద్భుత ప్రదర్శనకు స్టాండింగ్ ఒవేషన్‌ (photo gallery)