Golfer Aditi Ashok: టోక్యో ఒలింపిక్స్ లో గోల్ప్ మహిళా విభాగం తుది పోరులో భారత్‌కు చెందిన అతిది అశోక్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా పోటీకి దిగిన 23 ఏళ్ల అదితి.. ఒకానొక దశలో పసిడి కోసం పోటీ పడింది. తర్వాత ఒత్తిడికి గురై .. టోక్యో ఒలింపిక్స్ లో పతకం అందుకున్న భారత మొదటి గోల్ఫర్ప్ గా చరిత్ర సృషించే అవకాశం చేజార్చుకుంది.. నాలుగో స్థానానికి పరిమితమైంది.
టోక్యో ఒలింపిక్స్ లో పతకం చేజారినా తన అద్భుత ప్రదర్శనతో భారత యువ కెరటం అదితి అశోక్ అందరినీ అలరించింది. గోల్ఫ్ లో వివిధ దేశాలనుంచి పోటీపడి 60 మంది క్రీడాకారులు పోటీపడగా..200 వ ర్యాంకర్ భారత్ గోల్ఫర్ అదితి అశోక్ అద్భుతమైన ఆట ప్రదర్శించింది. తుది వరకూ పోరాడి నాలుగో ప్లేస్ తో సరిపెట్టుకుంది
మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే ఈవెంట్ చివరి నాల్గవ రౌండ్ శనివారం జరిగింది. ఈ రౌండ్ లో అదితికి న్యూజిలాండ్‌కు చెందిన లిడియా కో జపాన్ క్రీడాకారిని ఇమానే ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఒకానొక సమయంలో అతిధి గోల్డ్ పతకం కోసం కూడా పోటీపడింది. తుది సమరంలో రెండో ప్లేస్ కోసం హోరాహోరీ పోరు సాగింది. అదితి జపాన్ క్రీడాకారిణి మోనే ఇనామీ, న్యూజిలాండ్ ఎల్ కో లిడియాతో పోటీ పడి రజత పతకం రేసులో నిలిచింది. నాలుగో రౌండ్ లో తుది సమరంలో ప్రత్యర్థులు పుంజుకోవడంతో అదితి పతకం రేసు నుంచి అవుట్ అయ్యింది. చివరికి నాలుగో స్థానంలో నిలిచింది.. టోక్యో ఒలింపిక్స్ లో పతకం గెలిచి.. భారత దేశం నుంచి ఒలింపిక్స్ లో పతకం తెచ్చిన మొదటి గోల్ఫర్ గా చరిత్ర సృష్టించే అవకాశం తృటిలో చేజార్చుకుంది. ఏది ఏమైనా 200 వ ర్యాంకర్ అయిన ఈ భారత్ యువ గోల్ఫర్ ఓవరాల్‌గా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.
మూడో రౌండ్ ముగిసేసరికి అమెరికాకు చెందిన కొర్దా నెల్లీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇక భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి 4వ స్థానంలో నిలిచింది. గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా ఆవిర్భవిస్తారు.
Also Read:మలబద్దకం, గర్భసంబధం వ్యాధులతో బాధపడేవారికి దివ్య ఔషధం ఈ రసం.. రోజు 4 గ్లాసులు తాగితే అద్భుత ఫలితం