Tokyo Olympics 2020: టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారంతో 14 రోజులు ముగిశాయి. ఈ రోజు భారత్ ఖాతాలో కొత్తగా ఒక్క పతకం కూడా చేరలేదు. మొదట కాంస్య పతకం కోసం జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3-4 తేడాతో బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నా భజరంగ్ పునియా కూడా నిరాశ పరిచాడు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అజర్‌బైజాన్ హాజీ అలీవ్‌తో పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల సెమీ ఫైనల్‌లో ఓడిపోయారు. అయితే భజరంగ్ కాంస్యం కోసం శనివారం పోటీలోకి దిగనున్నాడు. ఇక మరో భారత రెజ్లర్ సీమా బిస్లా ట్యునీషియాకు చెందిన సారా హమ్ది చేతిలో 50 కేజీల మొదటి రౌండ్‌లో 1-3 తేడాతో ఓడిపోయింది. ఇక భారత్‌కు చెందిన 4× 400 మీ పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
ఓవైపు భారత్ మహిళల హాకీ జట్టు కాంస్యం కోసం పోరాడి బ్రిటన్ చేతిలో ఓడిపోయారు.. ఇక మరోవైపు భారత్ రెజ్లర్ భజరంగ్ ముందజంలో ఉన్నాడు. సెమీ ఫైనల్ లో అడుగు పెట్టాడు. క్వార్టర్ ఫైనల్ లో ఇరాన్ రెజ్లర్ మొర్తెజా ఘియాసి పై 2-1 తేడాతో భజరంగ్ విజయం సాధించాడు.
భారత్ కాంస్యం కల చెదిరింది.. బ్రిటన్ చేతిలో పోరాడిన ఓడిన భారత మహిళా జట్టు. నాలుగో క్వార్టర్ ఆరంభంలోనే బ్రిటన్ గోల్ కొట్టి 4-3తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పెనాల్టీ కార్నర్ ద్వారా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని గోల్ చేసింది. దీంతో బ్రిటన్ టోక్యో ఒలింపిక్స్ లో మరోసారి పతకాన్ని అందుకుంది. 2016 రియో ఒలింపిక్స్ లో స్వర్ణం అందుకున్న బ్రిటన్ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం అందుకుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో కాంస్యం కోసం భారత, బ్రిటన్ జట్లు తలపడుతున్నాయి. మొదటి క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు.. ఒక్క గోల్ కూడా చేయకుండా సమానంగా ఉన్నాయి. అయితే బ్రిటన్ కు రెండు ఫెనాల్టీ కార్నర్ లు లభించాయి. కానీ భారత్ గోల్ కీపర్ సవిత వాటిని నేర్పుతో గోల్ కాకుండా అడ్డుకుంది. రెండో క్వార్టర్ లో మొదటి గోల్ చేసిన బ్రిటన్ .. దీంతో భారత్ పై 1-0 లీడ్ లోకి వచ్చింది.
కొత్త చరిత్ర సృష్టించడానికి మన అమ్మాయిలు టోక్యో ఒలింపిక్స్ లో బరిలోకి దిగారు. కాంస్యం కోసం బ్రిటన్ తో తలపడుతున్నారు.
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారంతో 14 రోజులు ముగిశాయి. ఈ రోజు భారత్ ఖాతాలో కొత్తగా ఒక్క పతకం కూడా చేరలేదు. మొదట కాంస్య పతకం కోసం జరిగిన ప్లే-ఆఫ్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3-4 తేడాతో బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నా భజరంగ్ పునియా కూడా నిరాశ పరిచాడు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అజర్‌బైజాన్ హాజీ అలీవ్‌తో పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల సెమీ ఫైనల్‌లో ఓడిపోయారు. అయితే భజరంగ్ కాంస్యం కోసం శనివారం పోటీలోకి దిగనున్నాడు. ఇక మరో భారత రెజ్లర్ సీమా బిస్లా ట్యునీషియాకు చెందిన సారా హమ్ది చేతిలో 50 కేజీల మొదటి రౌండ్‌లో 1-3 తేడాతో ఓడిపోయింది. ఇక భారత్‌కు చెందిన 4× 400 మీ పురుషుల రిలే జట్టు ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడల్లో భారత 4×400మీ రిలే జట్టుకు నిరాశ ఎదురైంది. ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించలేక పోయింది. అయితే పోటీలో 3:00:25లో లక్ష్యాన్ని సాధించి భారత జట్టు ఆసియా రికార్డును బద్దలు కొట్టింది. 2018 ఆసియా క్రీడల్లో ఈ రికార్డు ఖతర్ పేరు మీద 3:00.56గా ఉంది. అయితే తాజాగా భారత జట్టు ఈ రికార్డును బ్రేక్ చేసినా.. ఫైనల్‌కు మాత్రం చేరుకోలేకపోయింది.
భారత గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ రతజం సాధించేందుకు అవకాశాలున్నాయి. శుక్రవారం మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రౌండ్ 3 లో అదితి రెండో స్థానంలో నిలిచింది. రౌండ్ 4 కూడా శుక్రవారమే జరగాల్సి ఉండగా.. వాతావరణ సంమస్యల కారణంగా శనివారానికి మార్చారు. ఇక పోటీలో మొదటి స్థానంలో.. అమెరికాకు చెందిన నెల్లి కొర్డా ఉండగా, ఆస్ట్రేలియా హన్నా గ్రీన్, న్యూజిలాండ్‌కు చెందిన లైడియా మూడో స్థానంలో ఉన్నారు. ఒకవేళ శనివారం కూడా మ్యాచ్ జరగకపోతే.. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితి అశోక్‌కు రజతం లభిస్తుంది. ఒకవేళ అదితి పతకం సాధిస్తే ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్‌గా సరికొత్త చరిత్రకు నాంది కానుంది.
టోక్యో ఒలింపిక్స్ కాంస్యం పోరులో భారత మహిళా హాకీ జట్టు ఓటమిపాలైనప్పటికీ అందరి ప్రశంసలు అందుతున్నాయి. ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు భారత ఉమెన్స్ హాకీ జట్టు సాగించిన పోరుపై అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చివరికి ప్రత్యర్థి జట్టుసైతం అభినందనలు కురిపించింది. గ్రేట్ బ్రిటన్ హాకీ ఈ విషయమై ట్వీట్ చేస్తూ.. ‘ఇండియన్ హాకీ జట్టు ఈ ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. అద్భుతమైన ఆట, అత్యద్భుతమైన ప్రత్యర్థి (ఇండియాను ఉద్దేశిస్తూ). మీ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలి’ అంటూ ట్వీట్ చేసింది. దీంతో బ్రిటన్ హాకీ స్పందించిన తీరుపై ప్రశంసలు అందుతున్నాయి.
What an amazing game, what an amazing opponent ?@TheHockeyIndia you’ve done something special at #Tokyo2020 – the next few years look very bright ? pic.twitter.com/9ce6j3lw25
— Great Britain Hockey (@GBHockey) August 6, 2021
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ హవా నడుస్తోంది. పతకాల రేసులో ప్లేయర్స్ తమ స్థాయికి మేర కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లేయర్స్‌కు స్ఫూర్తినిచ్చేందుకు దేశ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేలా ఏటికొప్పాక హస్తకళాకారుడు, రాష్ట్రపతి పురస్కార గ్రహీత శ్రీశైలపు చిన్నయాచారి సూక్ష్మ ఒలింపిక్స్ చిహ్నాన్ని రూపొందించారు. 22 క్యారెట్ బంగారంతో ఒలింపిక్స్ చిహ్నాన్ని తయారు చేసి గుండు సూది పైభాగంలో అమర్చారు. ఈ కళాఖండం అందిరినీ ఆకట్టుకుంటోంది. 1 మి.మీ. ఎత్తు, 2 మి.మీ వెడల్పుతో రూపొందించిన ఈ చిహ్నాన్ని మైక్రోస్కోప్‌లో మాత్రమే స్పష్టంగా చూడగలం.
14వ రోజు కొనసాగుతోన్న ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా భారత్ చివరి మ్యాచ్ సాయంత్రం ఆడనుంది. ఇందులో భాగంగా 4×400 మీటర్ల రిలే రౌండ్ 1 హీట్ 2.. మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ పోటీలో అథ్లెటిక్స్‌లో గురుప్రీత్ సింగ్, ప్రియాంక గోస్వామి, భవనా జాట్‌లు పురుషుల 4×400 మీటర్ల రిలే టీమ్‌లో పాల్గొంటారు. ఈ మ్యాచ్ సాయంత్రం 5.07 గంటలకు ప్రారంభంకానుంది.
ప్రత్యర్థి అజర్‌బైజాన్ రెజ్లర్ హాజీ చేతిలో 12-5 తేడాతో భజరంగ్ ఓటమి పాలైనా.. అయితే భారత్‌కు మరో పతకంపై మాత్రం ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. సెమీస్‌లో ఓటమి పాలైన భజరంగ్ శనివారం కాంస్య పతకం కోసం పోటీపడనున్నాడు. మరి రేపు (శనివారం) జరగనున్న మ్యాచ్‌లో భజరంగ్ రాణించి భారత్ ఖాతాలో మరో పతకాన్ని చేరుస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ప్రపంచ ఛాంపియన్ అజర్‌బైజాన్ రెజ్లర్ హజి అలియేవ్‌తో జరిగిన సెమీస్ బౌట్‌లో భజరంగ్ 5-12 తేడాతో పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఎన్నో ఆశలతో మొదలైన రెజ్లింగ్ పురుషుల విభాగంలో నిరాశే ఎదురైంది. రెజ్లింగ్ 65 కిలోల విభాగం సెమీస్‌లో భజరంగ్ పరాజయం పాలయ్యారు. అజర్‌బైజాన్ రెజ్లర్ హాజీ చేతిలో 12-5 తేడాతో ఓటమి చవిచూశాడు.
ఒలింపిక్స్‌లో ఓటమిని చవిచూసిన మహిళా హాకీ టీమ్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ప్లేయర్స్ ఏడ్చేశారు. దీంతో ప్రధాని వారిని అనునయించి దేశం మీ గురించి గర్వపడుతుందంటూ వారిలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
#WATCH | Indian Women’s hockey team breaks down during telephonic conversation with Prime Minister Narendra Modi. He appreciates them for their performance at #Tokyo2020 pic.twitter.com/n2eWP9Omzj
— ANI (@ANI) August 6, 2021
భారత మహిళా హాకీ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తోన్న మారిజైన్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఒలింపిక్స్‌లో బ్రిటన్‌తో ఆడిన మ్యాచ్‌గా నా చివరి అసైన్‌మెంట్ అంటూ వ్యాఖ్యానించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన మారిజైన్ 2017 నుంచి భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
20 కి.మీల రేస్‌వాక్‌లో ప్రియాంకకు నిరాశ ఎదురైంది. ప్రియాంక రేస్‌ను 1:33:26తో ముగించింది. ఇక ఈ పోటీలో ఇటలీకి చెందిన ఆంటోనెల్లా ప్లామిసనో 1:29:12 గడువలో రేసును పూర్తి చేసి స్వర్ణపతకాన్ని కైవసం చేసుకుంది.
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడల్లో మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రెజ్లర్ భజరంగ్ పునియా మరికాసేపట్లో సెమీస్ మ్యాచ్ ఆడనున్నాడు. పురుషుల 65 కిలోల విభాగంలో భజరంగ్ పునియా సెమీస్ చేరిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఖాతాలో మరో పతకం ఖరారైందని చెప్పాలి.
టోక్యో వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ క్రీడలు ఆదివారం (ఆగస్టు 8)తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి ఒలింపిక్స్ క్రీడలకు (2024) నిర్వహించనున్న ఫ్రాన్స్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఒలింపిక్స్ ముగుస్తున్న నేపథ్యంలో.. ఈఫిల్ టవర్‌పై అతి పెద్ద జెండా ఎగురవేయనుంది. పారిస్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ టోనీ ఎస్టాంగ్యూట్ తదుపరి ఒలింపిక్స్ క్రీడల గురించి ఆదివారం అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
టోక్యోలో ఒలింపిక్స్ లో భారత మహిళల హాకీ జట్టు తొలిసారిగా పతకం అందుకుందనే ఆశలు రేపిన రాణి బృదం చివరినిమిషంలో ఉసురుమనిపించింది. అయితే బ్రిటన్ పై భారత్ పోరాడిన తీరు పై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మరో అడుగు ముందుకేశారు.. తమ రాష్ట్రం నుంచి భారత్ హాకీ టీమ్ కు ప్రాతినిధ్యం వహించిన హాకీ ప్లేయర్ కు నగదు బహుమతిని ప్రకటించారు. తొమ్మిది మంది హాకీ ప్లేయర్లకు ఒకొక్కరికి రూ. 50 లక్షల ను అందజేయనున్నామని ప్రకటించారు. వీరికి ఘన స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేయాలనీఅధికారులను ఆదేశించారు.
క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురష్కారం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు.. ఈ పేరును మారుస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఈ అవార్డు ను ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్నగా మారుస్తూ.. ప్రధాని మోడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అవార్డు పేరును మార్చమని దేశ వ్యాప్తంగా వచ్చిన వినతుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత యువ కెరటం అదితి అశోక్ టోక్యో ఒలింపిక్స్ లో తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతోంది. గోల్ఫ్ లో వివిధ దేశాలనుంచి 60 మంది పోటీపడుతున్నారు. మూడో రౌండ్ ముగిసే సరికి అదితి అశోక్ సూపర్ పెర్ఫార్మెన్స్ తో రెండో స్థానంలో నిలిచింది. పతాకాన్ని నిర్ణయించే కీలకమైన రౌండ్ శనివారం జరగనుంది.
టోక్యో లో ఒలింపిక్స్ లో కాంస్యం అందుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న భారత మహిళల హాకీ జట్టు పై యావత్ భారతం ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమ్మాయిల పోరాట పటిమ అద్వితీయం అంటూ కొనియాడుతున్నారు. తాజాగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ ట్విట్టర్ వేదికగా భారత మహిళల హాకీ జట్టుని ప్రశంసించారు. మైదానంలో రాణించి.. మీ అద్భుతమైన ప్రదర్శనతో ప్రతి భారతీయుడి హృదయాలను గెలుచుకున్నారు. మీ చూపించిన ప్రతిభకు దేశం గర్విస్తుందంటూ భారత మహిళా జట్టుని కొనియాడారు.
Indian Women’s Hockey team excelled on the field and won the hearts of every Indian with their stellar performance. We are proud of you all.
— President of India (@rashtrapatibhvn) August 6, 2021
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం కోసం పోరాడి ఓడిన భారత్ మహిళ జట్టుపై సర్వత్రా ప్రసంల వర్షం కురుస్తుంది. బాధపడకండి అమ్మాయిలు. టోక్యో లో అద్భుతంగా ఆడి టాప్-4లో నిలిచారు. భారత్ గర్వపడేలా చేసినందుకు మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం అంటూ కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
हॉकी का सुनहरा दौर वापस लौट आया है ! ??
Don’t break down girls, you all played superb at #Tokyo2020 by reaching top 4 in the world!
I appreciate our Women’s Hockey for making India proud. #Cheer4India !! https://t.co/74J5QwxrYN pic.twitter.com/xMaGC3yLg6— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2021
పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల విభాగంలో భారత్ రెజ్లర్ భజరంగ్ క్వార్టర్ ఫైనల్ లో ఇరాన్ రెజ్లర్ మొర్తెజా ఘియాసితో తలపడుతున్నాడు. ఈ బౌట్ లో గెలిచిన.. భజరంగ్ సెమీ ఫైనల్ లో అడుగు పెట్టాడు. కుస్తీ పోటీల్లో భారత్ కు పతకం తెస్తాడని బజరంగ్‌పైనే భారత్‌కు భారీ అంచనాలున్నాయి.
కాంస్య పతకం కోసం చివరి వరకూ పోరాడి ఓడిన భారత్ మహిళా హాకీ జట్టుకి యావత్ బరాటం జే జే లు పలుకుతుంది. ఎటువంటి అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్ లో బరిలోకి దిగిన మహిళల జట్టు.. సెమీస్ వరకూ చేరుకుంది. కాంస్యం కోసం చేసిన పోరాటంలో బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలైంది. అయితే మీ పోరాట పటిమ గొప్పది.. టోక్యో ఒలింపిక్స్ లో మీరు సాధించిన విజయాలు.. మరింత మంది అమ్మాయిలు క్రీడల్లో అడుగు పెట్టేందుకు స్ఫూర్తినిస్తాయి అంటూ ప్రధాని మోడీ మహిళల జట్టుని అభినందించారు.
We narrowly missed a medal in Women’s Hockey but this team reflects the spirit of New India- where we give our best and scale new frontiers. More importantly, their success at #Tokyo2020 will motivate young daughters of India to take up Hockey and excel in it. Proud of this team.
— Narendra Modi (@narendramodi) August 6, 2021
పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల విభాగంలో భారత్ రెజ్లర్ భజరంగ్ విజయం సొంతం చేసుకున్నాడు. కిర్గిజిస్తాన్ రెజ్లర్ ఎర్నాజర్ అక్మతలియెవ్ భజరంగ్ పునియా 3-3 స్కోర్తో తో సమానంగా ఉన్నారు. అయితే భజరంగ్ మూవీ క్విక్ గా చేయడంతో ఒక పాయింట్ ఇస్తూ.. విజేతగా ప్రకటించారు. కుస్తీ పోటీల్లో భారత్ కు పతకం తెస్తాడని బజరంగ్‌పైనే భారత్‌కు భారీ అంచనాలున్నాయి.ఈ బౌట్‌లో గెలిచిన భజరంగ్ ఇరాన్ రెజ్లర్ మొర్తెజా ఘియాసితో తలపడతాడు.
పురుషుల ఫ్రీస్టైల్ 65 కిలోల ఫైనల్‌లో కిర్గిజిస్తాన్ రెజ్లర్ ఎర్నాజర్ అక్మతలియెవ్ పై భారత బజరంగ్ పునియా 3-1తో ఆధిక్యంలో ఉన్నాడు. కుస్తీ పోటీల్లో భారత్ కు పతకం తెస్తాడని బజరంగ్‌పైనే భారత్‌కు భారీ అంచనాలున్నాయి.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఓడిపోయింది. ఈరోజు గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో 3-4 తేడాతో ఓటమిపాలైంది.
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ పై బ్రిటన్ 4-3 తేడాతో గెలుపు
నాలుగో క్వార్టర్ బ్రిటన్ నాలుగో గోల్ చేసింది. దీంతో భారత్ పై మళ్ళీ 4-3 తో లీడ్ లోకి వచ్చింది.
కాంస్యం కోసం భారత్, బ్రిటన్ జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. మూడో క్వార్టర్ ముగిసేససరికి ఇరు జట్లు 3-3 గోల్స్ తో సమానంగా ఉన్నాయి. తాజాగా చివరి క్వార్టర్ లోకి అడుగు పెట్టాయి.
మహిళల ఫ్రీస్టయిల్ 50కిలోలు ఈ విభాగంలో సీమ బిస్లా తునిషియాదేశానికి చెందిన సర్ర హమ్ది చేతిలో ఓటమిపాలైంది. సీమా బిస్లా పై ప్రత్యర్థి సర్ర హమ్ది 1-3 తేడాతో గెలిచింది.
మహిళల ఫ్రీస్టయిల్ 50కిలోలు ఈ విభాగంలో సీమ బిస్లా తునిషియాదేశానికి చెందిన సర్ర హమ్దితో తలపడుతుంది. సీమా బిస్లా 0-1 తో వెనుకబడింది.
కాంస్యం కోసం తలపడుతున్న అమ్మాయిలు ..మూడో క్వార్టర్ లో బ్రిటన్ గోల్ చేసింది. దీంతో ఇరు జట్లు 3-3 గోల్స్‌తో సమానమయ్యాయి.
కాంస్యం కోసం భారత్ జట్టు.. రియో ఒలింపిక్స్ లో స్వర్ణ పతాకం సాధించిన బ్రిటన్ జట్టుతో హోరాహోరీగా తలపడుతుంది. మూడో క్వార్టర్ మొదలు పెట్టేసరికి భారత్ 3-2 గోల్స్ తో బ్రిటన్ పై లీడ్ లో ఉంది.
భారత్ డ్రాగ్ ఫ్లికర్ గుల్జిత్ కౌర్ టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు గోల్స్ ను చేసింది. ముఖ్యంగా కాంస్యం కోసం బ్రిటన్ తో తలపడుతున్న పోరులో బ్రిటన్ ఆధిక్యాన్ని తగ్గిస్తూ.. వరస వరసగా చేసిన రెండో గోల్స్ భారత్ జట్టుకు ఊపిరి ఇచ్చాయని చెప్పవచ్చు
రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ జట్టు అనూహ్యంగా పుంజుకుంది.. గుల్జిత్ రెండో గోల్స్ చేసింది.. మూడో గోల్స్ ను వందనా కటారియా చేయడంతో బ్రిటన్ పై 3-2 తో లీడ్ లోకి వచ్చింది.
భారత్ జట్టు రెండో గోల్ చేసి బ్రిటన్ స్కోర్ ని సమానం చేసింది. దీంతో ఇరు జట్లు 2-2 తో సమానంగా ఉన్నాయి. రెండు గోల్స్ ను గుల్జిత్ చేసింది.
రెండో క్వార్టర్ లో భారత్ కు లభించిన ఫెనాల్టీ కార్నర్ ను గుల్జిత్ గోల్ చేసింది. దీంతో భారత్ జట్టు బ్రిటన్ ఆధిక్యాన్ని తగ్గించినట్లు అయింది. భారత్, బ్రిటన్ లు 1-2 గోల్స్ లో ఉన్నాయి. భారత్ జట్టు రెండో గోల్ చేసి బ్రిటన్ స్కోర్ ని సమానం చేసింది. దీంతో ఇరు జట్లు 2-2 తో సమానంగా ఉన్నాయి.
రెండో క్వార్టర్ మొదలైన వెంటనే బ్రిటన్ మ్యాచ్ లో మొదటి గోల్ చేసింది. దీంతో భారత్ పై 1-0 తో లీడ్ లోకి వచ్చింది. కాంస్యం కోసం భారత్, బ్రిటన్ జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండో క్వార్టర్ లో మొదటి ఫెనాల్టీ కార్నర్ లభించింది. రెండో క్వార్టర్ ఎండింగ్ సమయంలో బ్రిటన్ రెండో గోల్ చేసింది.
రెండో క్వార్టర్ లో మొదటి గోల్ చేసిన బ్రిటన్ .. దీంతో భారత్ పై 1-0 లీడ్ లోకి వచ్చింది.
టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల హాకీలో కాంస్యం కోసం భారత, బ్రిటన్ జట్లు తలపడుతున్నాయి. మొదటి క్వార్టర్ ముగిసే సరికి ఇరు జట్లు.. ఒక్క గోల్ కూడా చేయకుండా సమానంగా ఉన్నాయి. అయితే బ్రిటన్ కు రెండు ఫెనాల్టీ కార్నర్ లు లభించాయి. కానీ భారత్ గోల్ కీపర్ సవిత వాటిని నేర్పుతో గోల్ కాకుండా అడ్డుకుంది.
టోక్యో ఒలింపిక్స్ లో మహిళల హాకీ పోటీల్లో భాగంగా ఈరోజు భారత్ , బ్రిటన్ జట్లు కాంస్యం కోసం హోరాహోరీన తలపడుతున్నాయి. మొదటి క్వార్టర్ లో బ్రిటన్ కు పెనాల్టీ కార్నర్ లభించింది. అయితే దానిని భారత్ గోల్ కీపర్ సవితా చక్కగా నివారింది గోల్ కాకుండా అడ్డుకుంది.
కొత్త చరిత్ర సృష్టించడానికి మన అమ్మాయిలు టోక్యో ఒలింపిక్స్ లో బరిలోకి దిగారు. కాంస్యం కోసం బ్రిటన్ తో తలపడుతున్నారు.
ఈరోజు కాంస్య పతక కోసం పోరు.. భారత జట్టు గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది.
ఉదయం 8 గంటల నుంచి పురుషుల ఫ్రీ స్టైల్ 65 కిలోలు ఈవెంట్.. భారత రెజ్లర్ భజరంగ్ పునియా ఎర్నాజర్ తో తలపడనున్నారు.
ఉదయం 8 గంటలకు మహిళల ఫ్రీస్టయిల్ 50కిలోలు ఈ విభాగంలో సీమ బిస్లా తునిషియాదేశానికి చెందిన సర్ర హమ్దితో పోటీపడనుండి.
ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు. 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఫైనల్.. ప్రియాంక గోస్వామి, భావ్నా జత్
సాయంత్రం 5.07 గంటలకు 4×400 మీటర్ల రిలే రౌండ్ 1 హీట్ 2..
అథ్లెటిక్స్‌లో గురుప్రీత్ సింగ్, ప్రియాంక గోస్వామి, భవనా జాట్ లు పురుషుల 4×400 మీటర్ల రిలే టీమ్ లో పాల్గొంటాయి.
టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్లు సెమీస్ నుంచి ఫైనల్ కు చేరి.. చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకున్నా.. తమ అసమాన ప్రతిభ వీరోచిత పోరాటంతో అందరి మనసులు దోచుకున్నాయి. ఇప్పటికే భారత పురుషుల హాకీ జట్టు.. 41 ఏళ్ల తర్వాత కాంస్య పతాకాన్ని సాధించి హాకీకి పునర్జీవం పోసింది. ఇక ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టు వంతు వచ్చింది. ఈరోజు గ్రేట్ బ్రిటన్ ఓడించి కాంస్యం సొంతం చేసుకుంటే మహిళలు కూడా చరిత్ర సృష్టిస్తుంది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్‌కు చేరింది. అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనాపై 2-1తో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ గ్రేట్ బ్రిటన్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది. దేశానికి మహిళల హాకీలో తొలి ఒలింపిక్స్ పతకం అందించడానికి ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు కెప్టెన్ రాణి రాంపాల్ ధీమా వ్యక్తం చేసింది. అమ్మాయిలు కూడా అద్భుత ప్రదర్శన చేసి. విశ్వక్రీడల్లో దేశ పతాకం ఎగురవేయాలని కొరుక్కుంటున్నారు.
ఇక మరోవైపు ఈరోజు ఉదయం 8 గంటలకు రెజ్లింగ్ లో భజరంగ్ పూనియా పురుషుల ఫ్రీ స్టైల్ 65 కిలోలు పోటీలో ఎర్నాజర్ తో తలపడనున్నాడు. భజరంగ్ పూనియాపై కూడా భారీ ఆశలే ఉన్నాయి.
అథ్లెటిక్స్, గోల్ఫ్ విభాగాల్లో కూడా భారత్ తలపడనుంది. గురుప్రీత్ సింగ్, అదితి అశోక్, దీక్ష దగర్, సీమ బిస్లా, ప్రియాంక గోస్వామిపై భారత్ పతక ఆశలు పెట్టుకుంది. వీరందరూ ఈరోజు సత్తాచాటాలని ప్రతి భారతీయుడు ఆకాంక్షిస్తున్నాడు.
మహిళల వ్యక్తిగత పోటీ రౌండ్ 3 జరుగుతోంది. ఇందులో అమెరికన్ నాన్నా కోర్జ్జ్ మాడ్సెన్ (DEN), అదితి అశోక్ (IND), ఎమిలీ క్రిస్టీన్ పెడెర్సన్ (DEN) లు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Finishing the week strong with Day 14 of #Tokyo2020!#Olympics | #StrongerTogether pic.twitter.com/72pQxTamrm
— Olympics (@Olympics) August 5, 2021