Tokyo Olympics 2021: 10 గోల్డ్ మెడల్స్‌తో పతకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో జపాన్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..

|

Jul 28, 2021 | 1:39 PM

Tokyo Olympics 2021: కరోనా మహమ్మారి కారణంగా ఏడాది తర్వాత టోక్యో వేదికగా ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ భయాన్ని పక్కకి పెట్టి.. 32వ ఒలంపిక్స్ ఎడిషన్ ను జపాన్..

Tokyo Olympics 2021: 10 గోల్డ్ మెడల్స్‌తో పతకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో జపాన్..  మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందో తెలుసా..
Japan
Follow us on

Tokyo Olympics 2021: కరోనా మహమ్మారి కారణంగా ఏడాది తర్వాత టోక్యో వేదికగా ఒలంపిక్స్ ప్రారంభమయ్యాయి. కోవిడ్ భయాన్ని పక్కకి పెట్టి.. 32వ ఒలంపిక్స్ ఎడిషన్ ను జపాన్ ఆతిధ్యం ఇచ్చింది. ఈ ఏడాది ఒలంపిక్స్ లో 205 దేశాల నుంచి దాదాపు 11 వేలమంది అథ్లెట్లు పాల్గొన్నారు. 17 రోజుల పాటు జరిగే జపాన్ రాజధాని టోక్యో ఒలంపిక్స్ లో ఒలంపిక్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 339 ఈవెంట్లలో పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలు ఆగస్టు 8 న ఒలింపిక్స్‌ ముగుస్తాయి.

చరిత్రలో రెండవసారి జపాన్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తోంది. 300కు పైగా పతకాలను క్రీడాకారులు గెల్చుకుంటారు. ఇక టోక్యో ఒలంపిక్స్ పతకాల పూర్తి పట్టికలో ఆతిధ్య దేశం జపాన్ దూసుకపోతోంది. 10 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు (18) సాధించి అగ్రస్థానంలో ఉంది. అమెరికాలో 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్య పతకాలు (25) సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా.. మూడోస్థానంలో చైనా (21) ఉంది. భారత్ కేవలం 1 రజత పతకం సాధించి..39వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఈరోజు జరిగిన పోటీల్లో పీవీ సింధు విజయం సాధించగా.. తరుజ్ దీప్, భారత హాకీ మహిళా జట్టు ఓటమి పాలయ్యాయి.

 

Also Read: Vinesh Phogat: టోక్యో ప్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ ఫొగెట్.. సమస్య పరిష్కారం అయిందంటున్న ఐఓఏ

Olympics 2021: విజేతలూ మెడల్స్ కొరకవద్దు అంటున్న ఒలంపిక్స్ నిర్వాహకులు.. అసలు అథ్లెట్స్ ఎందుకు కోరుకుతారో తెలుసా