PV Sindhu: కరోనా నిబంధనల నడుమ మొదలైన టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన తెలుగు తేజం పీవీ సింధు మరో గెలుపుని సొంతం చేసుకుంది. మొదటి మ్యాచ్ లో అలవోకగా నెగ్గిన ఈ స్టార్ ప్లేయర్ .. ఈరోజు గ్రూప్ జె నుంచి మరో విజయం సొంతం చేసుకుని టాప్ లో నిలిచి భారత పతకాల ఆశలను సజీవంగా ఉంచుతూ ప్రీ క్వార్టర్ ఫైనల్ కు ఎంట్రీ ఇచ్చింది. హాంకాంగ్ ప్లేయర్ చేంగ్ న్గాన్‌ను రెండు వరస సెట్లను . 21-9, 21-16తో ఓడించింది. తొలి గేమ్ లో వరుస స్మాష్, డ్రాప్ షాట్లతో ప్రత్యర్థికి చుక్కలు చూపింది. కేవలం 15 నిమిషాల్లోనే సునాయాసంగా సొంతం చేసుకుంది సింధు. రెండో గేమ్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. 14 పాయింట్ల వరకూ ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. అయితే ఆ తర్వాత పుంజుకున్న సింధు.. వరుసగా పాయింట్లు సాధించింది.
గ్రూప్ జేలో నుంచి సింధు..
ఆదివారం మహిళల సింగిల్స్‌లో తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌తో తలపడిన సంగతి తెలిసిందే.. సింధు కేవలం 28 నిమిషాల్లో మ్యాచ్ ముగించింది. పీవీ సింధు 21-7, 21-10తో వరుస సెట్లలో సునాయాసంగా గెలిచి తన సత్తా చాటింది. ఒలంపిక్స్ లో ఎలాంటి సంచనాలైనా నమోదు చేసే సత్తా క్రీడాకారులకు ఉందని పలు సందర్భాల్లో రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో పీవీ సింధు క్రీడాకారుల ఉందని.. ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకుండా తనదైన శైలిలో దూకుడుగా ఆడాలని.. అలవోకగా విజయం సొంతం చేసుకోవాలని క్రీడా అభిమానులు కోరుతున్నారు. 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింన తెలుగు తేజం సింధు ఈసారి పసిడి ని భారత్ కు తీసుకుని రావాలని సింధుకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.
#IND‘s PV Sindhu advances to the knock-out stage after defeating #HKG‘s Cheung Ngan Yi 21-9, 21-16 in women’s #Badminton singles. ??#Olympics | #StrongerTogether | #UnitedByEmotion | #Tokyo2020 @Pvsindhu1 pic.twitter.com/7sJerM3P1C
— #Tokyo2020 for India (@Tokyo2020hi) July 28, 2021
Also Read: