Tokyo Olympics 2020: ఏడు పతకాలు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా స్విమ్మర్.. పలు రికార్డులకు ఎసరు..!

|

Aug 01, 2021 | 1:24 PM

ఒలింపిక్స్‌లో ఓ అథ్లెట్ మహా అంటే ఎన్ని పతకాలు సాధిస్తాడని అనుకుంటున్నారు. మనకు తెలిసి రెండు, మూడు అనుకుంటాం. కానీ, ఈ ఆస్ట్రేలియా అథ్లెట్ ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి రికార్డు క్రియోట్ చేసి ఔరా అనిపించింది.

Tokyo Olympics 2020: ఏడు పతకాలు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా స్విమ్మర్.. పలు రికార్డులకు ఎసరు..!
Australia Swimmer Emma Mckeon
Follow us on

Tokyo Olympics 2020: ఒలింపిక్స్‌లో ఓ అథ్లెట్ మహా అంటే ఎన్ని పతకాలు సాధిస్తాడని అనుకుంటున్నారు. మనకు తెలిసి రెండు, మూడు అనుకుంటాం. కానీ, ఈ ఆస్ట్రేలియా అథ్లెట్ ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో ఏడు పతకాలు సాధించి రికార్డు క్రియోట్ చేసి ఔరా అనిపించింది. ఆమె ఎమ్మా మెక్‌కియాన్.. ఈమె పేరు ప్రస్తుతం టోక్యోలో హాట్‌టాపిక్‌గా మారింది. 10రోజులపాటు పోరాడుతున్నా మనదేశం కేవలం ఒకే ఒక్క పతకం సాధించింది. వాటికే మన ఆహా.. ఓహో అని సంబర పడుతున్నాం. ఎమ్మా మెక్‌కియాన్ మాత్రం ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఏడు పతకాలు సాధించి పలు రికార్డులు నెలకొల్పింది. స్విమ్మింగ్‌ విభాగంలో తనకు పోటీలేరంటూ దూసుకపోయింది. మొత్తం ఏడు విభాగాల్లో ఏడు పతకాలు కొల్లడొట్టింది. ఇందులో నాలుగు స్వర్ణాలు.. మూడు క్యాంస్యాలు ఉండడం విశేషం.

100 ఫ్రీస్టైల్‌, 4×100 ఫ్రీస్టైల్‌ రిలే, 50 ఫ్రీస్టైల్‌, 4×100 మెడ్లీరిలేల్లో బంగారు పతకాలు గెలిచింది. అలాగే 100 బటర్‌ఫ్లై, 4×200 ఫ్రీస్టైల్‌ రిలే, 4×100 మిక్స్‌డ్‌ మెడ్లీరిలే విభాగాల్లో క్యాంస్య పతకాలు సాధించింది. 1952లో సోవియట్ జిమ్మాస్ట్ మరియా గోరోకోవిస్కయ నెలకొల్పిన పలు రికార్డులను ఈ ఆస్ట్రేలియా స్విమ్మర్ బ్రేక్ చేసింది. అలాగే స్విమ్మింగ్ లెజెండ్ ఇయాన్ తోర్ప్ రికార్డును కూడా దాటేసింది. ఈమె తరువాత ఒలింపిక్స్‌లో అమెరికన్‌ ఫ్రీ స్టైల్‌ స్మిమ్మర్‌ కాలెబ్‌ డ్రెసెల్‌ 5 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎమ్మా మెక్‌కియాన్‌ 2016 రియో ఒలింపిక్స్‌ 4 పతకాలు సాధించింది. దీంతో ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో మొత్తం 11 పతకాలు సాధించి ఆస్ట్రేలియా తరుపున ఎక్కువ పతకాలు సాధించిన అథ్లెట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఒక ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా అమెరికాకు చెందిన మైకెల్‌ పెల్స్‌ అగ్ర స్థానంలో నిలిచాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో పెల్స్‌ 8 పతకాలు సాధించాడు. అయితే అవన్నీ బంగారు పతకాలే కావడం విశేషం.

Also Read:

India vs England: టీమిండియాలో అత్యంత వేగవంతమైన బౌలర్.. అరంగేట్ర టెస్టులోనే ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు దడ పుట్టించాడు