Tokyo Paralympics 2020: అథ్లెట్‌గా మారిన కలెక్టర్.. సరికొత్త రికార్డుతో పారా ఒలింపిక్స్‌కు పయనం!

|

Jul 20, 2021 | 11:50 AM

టోక్యో ఒలింపిక్స్ మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్నాయి. భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. అనంతరం ఆగస్టు 24 నుంచి టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ కూడా మొదలుకానున్నాయి.

Tokyo Paralympics 2020: అథ్లెట్‌గా మారిన కలెక్టర్.. సరికొత్త రికార్డుతో పారా ఒలింపిక్స్‌కు పయనం!
Suhas Lalinakere Yathiraj
Follow us on

Tokyo Paralympics 2020: టోక్యో ఒలింపిక్స్ మరో నాలుగు రోజుల్లో మొదలుకానున్నాయి. భారత్ నుంచి 119 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఆగస్టు 8 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. అనంతరం ఆగస్టు 24 నుంచి టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ కూడా మొదలుకానున్నాయి. పారా ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి వెళ్లే బృందంలో ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉన్నాడు. బ్యాడ్మింటన్‌కు అర్హత సాధించిన ఈ ఐఏఎస్.. పతకాన్ని సాధించేందుకు వెళ్లనున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా జిల్లా మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న సుహాస్ యతిరాజ్.. పారా-బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా గుర్తింపు తెరుచుకున్నాడు. సుహాస్ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 2వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. రెండేళ్ల క్రితమే ఈ కలెక్టర్ పారాలింపిక్స్‌కు వెళ్లేందుకు నిర్ణయించున్నట్లు ఆయన ఓ మీడియాతో తెలిపారు. అయిగే ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు చాలా కష్టపడ్డాడంట. ఓవైపు కలెక్టర్‌గా.. మరోవైపు అథ్లెట్‌గా కష్టపడుతూ.. ముందుకుసాగాడు. పగలు ఐఏఎస్‌గా బాధ్యతలు చేపడుతూ.. రాత్రి పూట బ్యాడ్మింటన్‌ను ప్రాక్టీస్ చేసేవాడు. పని పట్ల చూపించే ప్రేమే ఇలా తనను ఇలా నడిపిస్తున్నాయని ఈ యూపీ కలెక్టర్ వెల్లడించాడు. భగవద్గీతపై చాలా నమ్మకం ఉందని తెలిపాడు. గెలుపునకు, ఓడిపోవడానికి తేడా చాలా చిన్నదని, ఇలాంటివి నేను చాలా చూశానని పేర్కొన్నాడు. ఓడిన ప్రతీసారి కొన్ని పాఠాలు నేర్చుకుని ముందుకు సాగానని తెలిపాడు. అందువల్లే ప్రపంచ ర్యాక్సింగ్స్‌లో నంబర్ 3లో ఉన్నానని పేర్కొన్నారు.

మరోవైపు 2007 బ్యాచ్ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సుహాస్ యతిరాజ్.. ప్రస్తుతం కరోనా నియంత్రణలో ఫుల్ బిజీగా ఉన్నాడు. గదేడాది ఢిల్లీకి సరిహద్దులోని గౌతమ్ బుద్ద నగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని హసన్ జిల్లాలో జన్మించిన యతిరాజ్.. చిన్నతనం నుంచే ఆటల్లో మంచి ప్రతిభ చూపేవాడు. 2016 ఏసియన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం, బీడబ్ల్యూఎఫ్ టర్కిష్ ఓపెన్ ఛాంపియన్‌షిప్ 2017లో మెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. 2018లో వారణాసిలో జరిగిన నేషనల్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లోనూ గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే 2019లోనూ టర్కిష్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెలిచాడు. దాంతో టోక్యోలో జరిగే పారాలింపిక్స్‌కు అర్హత సాధించాడు.

Also Read:

India Vs Srilanka: గబ్బర్ రికార్డుల మోత.. కెప్టెన్‌గా అరుదైన ఘనత.. సెహ్వాగ్‌తోనే పోటీ!