Tokyo Olympics 2020: గతేడాది జరగాల్సిన ఒలింపిక్స్ కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. జులై 23 నుంచి టోక్యో వేదికగా ఈ క్రీడలు మొదలు కానున్నాయి. ఆగస్టు 8 వరకు జరిగే టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. ఈ లిస్టును భారత ఒలింపిక్ సంఘం ఇటీవలే విడుదల చేసింది. ఈ మేరకు భారత అథ్లెట్లకు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ.. వారిలో స్ఫూర్తిని కలిగిస్తున్నారు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అథ్లెట్లను ఉద్దేశిస్తూ.. ఓ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశాడు. మూడు రంగుల భారత జెండాను చూస్తే.. ఎలాంటి సమయంలోనైనా మనకు తెలియని ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుంది. ఈ ఒలింపిక్స్ లో పెద్దగా తేడా ఏం లేదు. ప్రేక్షకులుగా స్టేడియంలో లేకపోవచ్చు. కానీ, మేం ఎప్పుడూ మీ వెంటే ఉండి ఉత్సాహపరుస్తుంటాం. మీ ప్రదర్శన మమ్మల్ని గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాం’ అంటూ ట్యాగ్ ఇచ్చి వీడియోను పోస్ట్ చేశారు. ‘సంతోషంగా ఒలింపిక్స్ కు సన్నద్ధం కావాలి. ఈ ఏడాది జరిగే ఒలింపిక్స్ లో పెద్దగా తేడా ఏం ఉండదు. భారత్ గర్వపడేలా మీరు ఒలింపిక్స్ లో ఆడాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశం తరపును ఆడబోతున్న మీరు ఒత్తిడిలో ఉండకూడదు. దేశం మొత్తం మీ వెంటే ఉందని’ ధైర్యం చెప్పాడు.
మరోవైపు, టోక్యోలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో.. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంతో పాటు జపాన్ ప్రభుత్వం ఆందోళనలో పడ్డాయి. జులై 23 వరకు పరిస్థితులు ఎలా ఉంటాయోనని గుబులు పట్టుకుందంట. ఇలాంటి పరిస్థితుల్లో అథ్లెట్లు ఒత్తిడికి గురి కాకుండా భారత ఒలింపిక్స్ సంఘం ప్రముఖులతో ఇలాంటి వీడియోలు చేపిస్తూ.. ధైర్యం చెబుతోంది. కాగా, ఒలింపిక్స్ లో జాతీయ జెండా పతాకాధారులుగా ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ కాగా, పురుషుల నుంచి హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈమేరక నిన్న భారత ఒలింపిక్స్ సంఘం వీరి పేర్లు విడుదల చేసింది. వీరు టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలో మూడు రంగుల జెండాను పట్టుకుని భారత బృందాన్ని ముందుకు నడిపించనున్నారు. అలాగే ఒలింపిక్స ముగింపు వేడుకల్లో రెజ్లర్ బజరంగ్ పూనియా కూడా ఈ అవకాశం దక్కింది.
We all get goosebumps when we see the tricolour ?? being represented!
This Olympics, it shall be no different and we’ll all be cheering loudly from India as you make us proud.#Cheer4India pic.twitter.com/OFVu8Vae8E
— Sachin Tendulkar (@sachin_rt) July 6, 2021
Also Read: