Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ కు భారీ సంఖ్యలో చైనా అథ్లెట్లు.. ఎక్కువ పతకాలే లక్ష్యంగా బరిలోకి!

|

Jul 20, 2021 | 11:58 AM

టోక్యో వేదికగా జులై 23 నుంచి మొదలు కానున్న ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు అన్ని దేశాలు తమ అథ్లెట్లను కూడా రెడీ చేశాయి. ఇక భారత్ నుంచి ఈ ఏడాది ఒలింపిక్స్ కు దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు.

Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్ కు భారీ సంఖ్యలో చైనా అథ్లెట్లు.. ఎక్కువ పతకాలే లక్ష్యంగా బరిలోకి!
Olympics
Follow us on

Tokyo Olympics 2020: టోక్యో వేదికగా జులై 23 నుంచి మొదలు కానున్న ఒలింపిక్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు అన్ని దేశాలు తమ అథ్లెట్లను కూడా రెడీ చేశాయి. ఇక భారత్ నుంచి ఈ ఏడాది ఒలింపిక్స్ కు దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. మన పొరుగు దేశం చైనా.. టోక్యో ఒలింపిక్స్ కోసం భారీగా అథ్లెట్లను పంపనుందంట. 2016 రియో ఒలింపిక్స్‌లో డ్రాగన్ కంట్రీ 416 మంది అథ్లెట్లను పంపింది. టోక్యో ఒలింపిక్స్ కోసం మరింత పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమేరకు ఎక్కువ మందిని ఒలింపిక్స్ బరిలోకి దించి చరిత్ర క్రియోట్ చేయాలని చైనా చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే చైనా నుంచి 224 ఈవెంట్స్ కోసం 318 మంది క్వాలిఫై అయిన‌ట్లు సమాచారం. కాగా, రియో ఒలింపిక్స్ లో 210 ఈవెంట్లలో మొత్తం 416 మంది అథ్లెట్లు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా ఎక్కువ పతకాలు సాధించేందుకు చైనా అథ్లెట్లు బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌ 2021లో జిమ్నాస్టిక్స్‌, డైవింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్‌, షూటింగ్‌ ల‌లో బంగారు పతకాలు పట్టుకోవాలని ఆరాటపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బ్యాడ్మింట‌న్‌, ఉమెన్స్ వాలీబాల్‌, తైక్వాండో, సెయిలింగ్‌, క‌రాటే, ఉమెన్స్ బాక్సింగ్‌, రోయింగ్‌, స్విమ్మింగ్‌ల‌లోనూ పతకాలను సాధించాలనే పట్టుదలతో ఉందంట. కాగా, చైనా దేశానికి జిమ్నాస్టిక్స్‌, బ్యాడ్మింట‌న్‌, టేబుల్ టెన్నిస్‌, తైక్వాండో క్రీడల్లో స్టార్ ప్లేయర్స్ అందుబాటులో ఉన్నారు. ఈమేరకు ఈ సారి ఎక్కువ పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉంది. ఇక చైనా మెన్స్ బాస్కెట్ బాల్ టీం 37 ఏళ్ల తరువాత తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేక పోవడం గమనార్హం. ఈ విషయంలో చైనా అసంతృ ప్తి గా ఉందంట.

2020లో జరగాల్సిన ఒలింపిక్స్ కరోనాతో ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. మరోవైపు, టోక్యోలో కరోనా కేసులు బయటపడుతుండడంతో నిర్వాహకులకు భయం పట్టుకుందంట. తాజాగా సెర్బియా బృందంలో ఓ పాజిటివ్ కేసు వెలుగుచూసింది. హనెడా విమానాశ్రయంలో జరిపిన పరీక్షల్లో సెర్బియా రోయింగ్ జట్టులోని ఓ అథ్లెట్​కు కరోనా​వచ్చినట్లు తేలింది. దీంతో ఆ అథ్లెట్ ను అక్కడే ఐసోలేషన్​లో ఉంచారంట. ఆయనతో ప్రయాణించిన మరో నలుగురిని కూడా క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఒలింపిక్స్ విలేజ్ కి మొదట చేరుకున్న ఉగాండా అథ్లెట్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. క్రీడలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఇంకెన్ని కేసులు బయట పడతాయోనని నిర్వాహాకులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.

Also Read:

Teamindia Womens: టీమిండియా స్టార్ బౌలర్ బయోపిక్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్..! ఈ ఏడాది చివరిలోగా పట్టాలపైకి?

India vs Sri Lanka: ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో సత్తా చాటిన భువనేశ్వర్ టీం..!