Olympics 2021: 130 కోట్లమంది భారతీయుల ఆశలను మోసుకుంటూ ఒలంపిక్స్ కు పయనం కానున్న క్రీడాకారులు.. ఎన్ని విభాగాల్లో పోటీ..

Tokyo Olympics 2021: భారత దేశంలోకి జనాభాలో రెండో స్థానం.. కానీ క్రీడాకారులను తయారు చేయడంలో ఎన్నో స్థానంలో లెక్కపెట్టాలంటే కష్టం.. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు..

Olympics 2021: 130 కోట్లమంది భారతీయుల ఆశలను మోసుకుంటూ ఒలంపిక్స్ కు పయనం కానున్న క్రీడాకారులు.. ఎన్ని విభాగాల్లో పోటీ..
Tokyo 2020

Edited By:

Updated on: Jul 15, 2021 | 2:29 PM

Tokyo Olympics 2021: భారత దేశంలోకి జనాభాలో రెండో స్థానం.. కానీ క్రీడాకారులను తయారు చేయడంలో ఎన్నో స్థానంలో లెక్కపెట్టాలంటే కష్టం.. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లకు పైగా అయ్యింది. కానీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ.. క్రీడాల్లో తమ ప్రతిభను చాటి మెడల్స్ తెచ్చే విషయంలో మాత్రం టాప్ లో కాదు కదా కనీసం 25 వ స్థానంలో కూడా చోటు ఉండదు.. ఒలింపిక్స్ పోటీలో పాల్గొనడం ప్రతి ఒక్క క్రీడాకారుడు కనే కల. ఒలంపిక్స్ లో పాల్గొని అందులో పసిడి పతకం తెచ్చుకోవడం ఎంతో గర్వంగా క్రీడాకారుడు భావిస్తాడు.. ఈ సారి 130 కోట్ల భారతీయుల ఆశలను మోసుకుంటూ టోక్యోలో జరిగే ఒలంపిక్స్ లో పాల్గొనడానికి 119 మంది భారతీయ క్రీడాకారులు పయనం కానున్నారు. ఏఏ క్రీడా విభాగాల్లో మన క్రీడాకారులు పోటీ చేయనున్నారంటే..

ఆర్చరీ విభాగంలో నలుగురు పోటీ పడుతుండగా.. అథ్లెటిక్స్ విభాగంలో 16 మంది పోటీకి వెళ్లనున్నారు. ఇక పతాకాలమీద ఎన్నో ఆశలను పెంచే విభాగం బాడ్మింటన్. ఈ రంగంలో ముగ్గురు పోటీపడనున్నారు. బాక్సింగ్ విభాగంలో తొమ్మిది మంది అర్హత సాధించారు.
ఫౌవాడ్ మీర్జా గత 20 సంవత్సరాలలో క్రీడలకు అర్హత సాధించిన మొదటి భారత ఈక్వెస్ట్రియన్ రికార్డ్ కెక్కారు. ఫెన్సింగ్ విభాగంలో అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్‌గా భవానీ దేవి నిలిచారు. గోల్ఫ్ విభాగంలో భారత్ తరపున ముగ్గురు పాల్గొననున్నారు.  జిమ్నాస్టిక్స్ , పురుషుల జాతీయ జట్టు , మహిళల జాతీయ జట్టు , జూడో , రోయింగ్ , సెయిలింగ్ , షూటింగ్ , స్విమ్మింగ్ ,  టేబుల్ టెన్నిస్ , టెన్నిస్ , వెయిట్ లిఫ్టింగ్ , రెజ్లింగ్ తదితర విభాగాల్లో ఈ సారి భారత దేశం తరపున ఒలంపిక్స్ పోటీ ల్లో తలపడుతున్నారు.

Also Read: విదేశంలో భారతీయ సంస్కృతిని చాటుతున్న విష్ణు దేవాలయం.. ఆ గుడిని జాతీయ జెండాపై ఉంచి గౌరవం (photo gallery)