ఆ బౌలర్ పగేంటి?..ఛాంపియన్ టీంను అందుకే కుప్పకూల్చాడా?

ఐర్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి రోజు లంచ్‌లోపే ఆలౌటయ్యింది. ఇటీవలే వన్టే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్ టీంకు ఇది చాలా చిన్నతనంగా అనిపించే విషయం. పైగా అదేదో బలమైన జట్టు కాదు..పసికూన ఐర్లాండ్. క్రికెట్‌లో సంచలనాలు సహజమే..కానీ ప్రపంచకప్‌కి అర్హత సాధించలేని ఒక జట్టుచేతిలో..10 రోజుల క్రితం ఛాంపియన్‌గా నిలిచిన జట్టు పరాజయం పాలవ్వడం నిజంగా గమనార్హం. కాగా 142 బంతుల్లోనే 85 రన్స్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్ కావడానికి ప్రధాన కారణం ఐర్లాండ్ పేసర్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 5:35 am, Thu, 25 July 19
ఆ బౌలర్ పగేంటి?..ఛాంపియన్ టీంను అందుకే కుప్పకూల్చాడా?

ఐర్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలి రోజు లంచ్‌లోపే ఆలౌటయ్యింది. ఇటీవలే వన్టే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లాండ్ టీంకు ఇది చాలా చిన్నతనంగా అనిపించే విషయం. పైగా అదేదో బలమైన జట్టు కాదు..పసికూన ఐర్లాండ్. క్రికెట్‌లో సంచలనాలు సహజమే..కానీ ప్రపంచకప్‌కి అర్హత సాధించలేని ఒక జట్టుచేతిలో..10 రోజుల క్రితం ఛాంపియన్‌గా నిలిచిన జట్టు పరాజయం పాలవ్వడం నిజంగా గమనార్హం.

కాగా 142 బంతుల్లోనే 85 రన్స్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్ కావడానికి ప్రధాన కారణం ఐర్లాండ్ పేసర్ టిమ్ ముర్తగ్. ఇతడు పుట్టింది, పెరిగింది, క్రికెట్ కెరీర్ మొదలు పెట్టింది ఇంగ్లాండ్‌లోనే. కెరీర్ ఆరంభంలో సర్రే కౌంటీకి ఆడిన టిమ్.. 2005లో మిడిల్‌సెక్స్‌తో జరిగిన డొమెస్టిక్ టీ20 మ్యాచ్‌లో 24 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. టీ20ల్లో అప్పటికే అదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. 2007లో మిడిల్‌సెక్స్‌కు మారాడు. 2008 సీజన్లో 104 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. 2011లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో 85 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. కానీ ఇంగ్లాండ్ సెలెక్టర్లు అతణ్ని పట్టించుకోలేదు.
దీంతో ముర్తగ్ ఇంగ్లాండ్‌ను వీడాలని నిర్ణయించుకున్నాడు.

2011 అక్టోబర్‌లో ఐరిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అతడి తాత ఐర్లాండ్ వాస్తవ్యుడు కావడంతో నాలుగు నెలల్లోనే అతడికి అక్కడి పౌరసత్వం దక్కింది. మిడిల్‌సెక్స్ తరఫున అదరగొట్టిన టిమ్.. ఐర్లాండ్‌కు వరంలా మారాడు. పౌరసత్వం రాగానే ఆస్ట్రేలియాపై వన్డేల్లో అరంగేట్రం చేసిన టిమ్.. తర్వాత బంగ్లాదేశ్‌పై టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు.  2015 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ తరఫున ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై ఆడిన టిమ్.. తర్వాత గాయం బారిన పడ్డాడు. తర్వాత మళ్లీ కోలుకోని జట్టులో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. తనను ఇబ్బందులు పెట్టిన మేనేజ్‌మెంట్‌పై కసితోనే టిమ్ ముర్తగ్ ఒక్కసారిగా అద్భుత ప్రదర్శన చేసి ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌కు కుప్పకూల్చాడని  సోషల్ మీడియాలో న్యూస్ వెల్లువెత్తుతున్నాయి.