రోడ్డు ప్ర‌మాదంలో నేను చ‌నిపోలేదు…పాక్ క్రికెట‌ర్ ఆవేద‌న‌

|

Jun 22, 2020 | 5:26 PM

కారు ప్రమాదంలో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ ప్రాణాలు విడిచాడంటూ గత కొన్నిరోజుల నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు స‌ర్కులేట్ అయ్యాయి. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు అత‌డికి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు.

రోడ్డు ప్ర‌మాదంలో నేను చ‌నిపోలేదు...పాక్ క్రికెట‌ర్ ఆవేద‌న‌
Follow us on

కారు ప్రమాదంలో పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ ప్రాణాలు విడిచాడంటూ గత కొన్నిరోజుల నుంచి సోష‌ల్ మీడియాలో వార్త‌లు స‌ర్కులేట్ అయ్యాయి. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు అత‌డికి శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు. అయితే తాను చ‌నిపోలేద‌ని బ్రతికే ఉన్నానని తెలిపాడు మహ్మద్ ఇర్ఫాన్. త‌న‌ కుటుంబం కూడా సేఫ్ గా ఉందని వివ‌రించారు. ఫేక్ వార్తలు ప్రసారం చేయొద్దని నెటిజ‌న్ల‌ను కోరారు. ఇలాంటి చర్యల వల్ల తామంతా మాన‌సిక వ్య‌ధ‌ను అనుభ‌వించిన‌ట్టు తెలిపాడు.

అస‌లు తేడా ఎక్కడ వ‌చ్చిందంటే…

పాకిస్థాన్ దివ్యాంగ క్రికెటర్​ మహ్మద్ ఇర్ఫాన్ కడుపు ఇన్ఫెక్షన్​తో బాధపడుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని జట్టు కోచ్ ఉమర్ ఫయ్యాజ్ తెలిపారు. 31 ఏళ్ల ఈ ఆటగాడు.. గతకొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ట్లు వెల్ల‌డించాడు. 2007లో పాక్ దివ్యాంగ జట్టు తరఫున కెరీర్​ ప్రారంభించిన మ‌హ్మ‌ద్.. దాదాపు 13 సంవత్సరాలపాటు జ‌ట్టుకు సేవ‌లందించాడు. ఇద్ద‌రి పేర్లు ఒక‌టే అవ్వ‌డం..ఇద్ద‌రూ క్రికెట‌ర్లే అవ్వ‌డంతో నెటిజ‌న్లు పొర‌బ‌డ్డారు.