వావ్.. వాట్ ఏ క్యాచ్.. చూస్తే మైండ్‌ బ్లాక్ అవ్వాల్సిందే..

ఒకప్పుడు అద్భుతమైన ఫిల్డింగ్‌ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే ప్లేయర్స్‌లో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్.. సురైష్ రైనా.. ఇక మహిళా క్రికెటర్స్‌లో అయితే.. ఎవరి పేర్లు కూడా అంత ప్రాచూర్యంలో లేవన్నది సామాన్యుడి ఫీలింగ్.. కానీ ఇప్పుడు ఆ స్టార్ ఫీల్డర్లకు వారాసురాలు వచ్చేసింది. అది కూడా మన భారత మహిళా క్రికెట్ టీం నుంచే. అవును భారత వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న […]

వావ్.. వాట్ ఏ క్యాచ్.. చూస్తే మైండ్‌ బ్లాక్ అవ్వాల్సిందే..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 03, 2019 | 4:49 PM

ఒకప్పుడు అద్భుతమైన ఫిల్డింగ్‌ చేస్తూ.. క్యాచ్‌లు పట్టే ఆటగాళ్లు ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే ప్లేయర్స్‌లో తొలి ఆటగాడు జాంటీ రూడ్స్.. ఆ తర్వాత మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్.. సురైష్ రైనా.. ఇక మహిళా క్రికెటర్స్‌లో అయితే.. ఎవరి పేర్లు కూడా అంత ప్రాచూర్యంలో లేవన్నది సామాన్యుడి ఫీలింగ్.. కానీ ఇప్పుడు ఆ స్టార్ ఫీల్డర్లకు వారాసురాలు వచ్చేసింది. అది కూడా మన భారత మహిళా క్రికెట్ టీం నుంచే. అవును భారత వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్ ఓ అద్బుతమైన క్యాచ్ పట్టుకుని ఇంటర్నెట్‌న్ షేక్ చేస్తోంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకుంది భారత వైస్‌ కెప్టెన్‌ హార్మన్‌ప్రీత్‌ కౌర్‌.

విండీస్‌ మహిళా క్రికెట్‌ జట్టుతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. అయితే భారత్‌ మ్యాచ్‌ ఓడినప్పటికీ.. హర్మన్‌ అందుకున్న క్యాచ్‌.. మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఆంటిగ్వాలోని సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో విండీస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసింది. 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. విండీస్‌ కెప్టెన్‌ స్టిఫానీ టేలర్‌ దూకుడుగా ఆడుతూ.. మెరుపులు మెరిపించింది. అయితే ఈ నేపథ్యంలో సెంచరీకి చేరువవుతున్న వేళ.. హర్మన్‌ ప్రీత్ బ్రేక్ వేసింది. ఏక్తాబిస్త్‌ బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టి.. సెంచరీకి చేరువైన స్టిఫానీ.. మరో సిక్స్‌ కొట్టేందుకు ప్రయత్నించింది. భారీ షాట్‌ కొట్టిన స్టిఫానీ సిక్సర్‌ ఖాయమనుకుంది. కానీ, లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హర్మన్‌ ప్రీత్‌ గాల్లోకి ఎగిరి లెఫ్ట్ హ్యాండ్‌తో క్యాచ్ పట్టుకుంది. దీంతో స్టేడియమంతా ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యింది. సింగిల్ హ్యాండ్‌తో గాల్లోకి ఎగిరి పట్టుకున్న హర్మన్‌ ప్రీత్ క్యాచ్‌ చూసి సహచరులు అభినందించారు. అంతేకాదు.. హర్మన్‌ పట్టిన ఈ క్యాచ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారింది.

కాగా, 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 224 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ ప్రియా పూనియా 107 బంతుల్లో 75 పరుగులు చేసింది. అయతే ఆ తర్వాత మిథాలీరాజ్‌, హర్మన్‌‌లు విఫలమయ్యారు. విండీస్‌ స్పిన్నర్‌ అనిషా మహమ్మద్‌ ఐదు వికెట్లు తీసి.. విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఇటు పార్టీ.. అటు కేంద్ర ప్రభుత్వం.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు
ఇటు పార్టీ.. అటు కేంద్ర ప్రభుత్వం.. కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
ఇంగ్లిష్‌లో మాట్లాడినందుకు స్టార్ హీరో కూతురిపై ట్రోల్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. 7 నుంచి 13వ తేదీ వరకు పాఠశాలలు బంద్‌
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపిన పోలీసులు
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
మకర సంక్రాంతి రోజున స్నానం, దానానికి శుభ సమయం ఎప్పుడు?
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..
ఈ లక్షణాలతో మీలో హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చు..