Oliver kahn: భారత్‌కు మాజీ లెజెండరీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌.. ముంబయిని సందర్శించనున్న..

|

Nov 05, 2023 | 9:54 AM

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ కూడా ఫుట్‌బాల్‌లో రాణించే దిశగా అడుగులు పడుతున్నాయి. జర్మనీ క్లబ్ బేయర్న్ మ్యూనిచ్ కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర కప్‌ను నిర్వహించింది. ఈ టోర్నీ నుంచి అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే భారత్‌లో ఫుట్‌ బాల్‌ నెమ్మదిగా పుంజుకుంటున్న...

Oliver kahn: భారత్‌కు మాజీ లెజెండరీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌.. ముంబయిని సందర్శించనున్న..
Oliver Kahn
Follow us on

గడిచిన రెండేళ్లుగా భారత్‌లో ఫుట్‌బాల్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. భారతదేశంలో క్రికెట్ ఇష్టమైన క్రీడ అయినప్పటికీ, ఫిఫా ప్రపంచకప్ తర్వాత దేశంలో చాలా మంది ఫుట్‌బాల్ అభిమానులు పుట్టుకొచ్చారు. ఫిఫా ఫైనల్స్‌లో భారత్‌కు అత్యధిక వీక్షకులు ఉన్నారు. భారతీయుల్లో ఫుట్‌బాల్‌పై పెరుగుతోన్న ఆదరణ నేపథ్యంలో మాజీ జర్మన్ లెజెండరీ ఫుట్‌బాల్ ప్లేయర్ ఆలివర్ ఖాన్ భారత ఆర్థిక రాజధాని ముంబయిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు.

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ ఫుట్‌బాల్. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ కూడా ఫుట్‌బాల్‌లో రాణించే దిశగా అడుగులు పడుతున్నాయి. జర్మనీ క్లబ్ బేయర్న్ మ్యూనిచ్ కొన్ని నెలల క్రితం మహారాష్ట్ర కప్‌ను నిర్వహించింది. ఈ టోర్నీ నుంచి అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లను కూడా ఎంపిక చేశారు. ఈ క్రమంలోనే భారత్‌లో ఫుట్‌ బాల్‌ నెమ్మదిగా పుంజుకుంటున్న తరుణంలో.. జర్మనీ మాజీ గోల్ కీపర్ ఆలివర్ కాన్ మంబయికి వస్తున్నాడు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఆయన ముంబయికి వస్తున్న కారణాన్ని ప్రస్తావించారు.

ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. ‘నమస్తే, నేను భారతదేశానికి రావడానికి ఎదురు చూస్తున్నాను. 2008 వీడ్కోలు ఎప్పటికీ మరచిపోలేను. అద్భుతమైన సంస్కృతి ఉన్న ఈ దేశానికి వచ్చే వారం తిరిగి వస్తాను. నేను ఫుట్‌బాల్ ప్రేమికులను కలుసుకుంటాను, భారతదేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధి గురించి మరింత తెలుసుకుంటాను, ”అని చెప్పుకొచ్చాడు.

లెజెండరీ ఫుట్‌బాల్ స్టార్ వచ్చే వారం ముంబయికి రానున్నారు. అయితే దీని తేదీ ఇంకా ఖరారు కాలేదు. జర్మనీ తరఫున ఒలివర్ కాన్ మొత్తం 86 మ్యాచ్‌లు ఆడాడు. 2002 FIFA ప్రపంచ కప్‌లో జర్మనీని ఫైనల్స్‌కు తీసుకెళ్లడంలో ఆలివర్ కీలక పాత్ర పోషించాడు. కానీ ఫైనల్‌లో బ్రెజిల్‌పై జర్మనీ 2-0 తేడాతో ఓడిపోయింది. అతను పోటీలో ఉత్తమ ప్రదర్శన కోసం లెవ్ యాషిన్ అవార్డును అందుకున్నాడు.

భారతదేశాన్ని సందర్శించిన ఫుట్‌బాల్ దిగ్గజాల జాబితా విషయానికొస్తే.. వేన్న్ రూనీ, లెవ్ యాషిన్, టెర్రీ పైన్, పీలే,
కార్లోస్ అల్బెర్టో, బాబీ మూర్, యుసేబియో, రోనాల్డ్ కోమన్, రోజర్ మిల్లా, జినెడిన్ జిదానే, ఆలివర్ కాన్, డియెగో మారడోనా,
డియెగో ఫోర్లాన్, డేవిడ్ బెక్హాం, లియోనెల్ మెస్సీ, ఫ్రాంక్ రిబరీ, అలెశాండ్రో డెల్ పియరో.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..