IND vs ENG 1st T20: ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన హార్దిక్

|

Jul 08, 2022 | 6:00 AM

ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ - ఇండియా (India - England) టీ - 20 సిరీస్ లో మొదటి టీ -20లో టీమిండియా దుమ్ము లేపింది. ఇంగ్లండ్ పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన హార్దిక్‌ పాండ్య.....

IND vs ENG 1st T20: ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటిన హార్దిక్
Team India
Follow us on

ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ – ఇండియా (India – England) టీ – 20 సిరీస్ లో మొదటి టీ -20లో టీమిండియా దుమ్ము లేపింది. ఇంగ్లండ్ పై 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్ లో బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టిన హార్దిక్‌ పాండ్య.. ఇంగ్లాండ్‌ పతనాన్ని నిర్దేశించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్ జట్టు 148 పరుగులకే ఆలౌటైంది. భారత జట్టులో హార్దిక్‌ పాండ్య(51) అర్ధశతకంతో రాణించడంతో పాటు బౌలింగ్ లో నాలుగు వికెట్లు తీశాడు. చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ తలో రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్‌కుమార్‌, హర్షల్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసి భారత్ కు గెలుపు అందించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 రన్స్ చేసింది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు 199 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో మొయిన్‌ అలీ, క్రిస్‌ జోర్డాన్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. టోప్లే, మిల్స్‌, పార్కిన్‌సన్‌ తలో వికెట్‌ పడగొట్టాడరు. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఇంగ్లండ్ 148 పరుగులకే ఆలౌట్ అయింది.