Virat Kohli: గ్రౌండ్‌లో ఎంతో గంభీరంగా కనిపించే మిస్టర్ స్మార్ట్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. కోపం ఎక్కువ అన్న విషయం అందరికి తెలుసిందే. బాధ వచ్చినా.. సంతోషం కలిగినా.. ఇట్టే రియాక్ట్ అవుతుంటాడు. ఆ సమయంలో కోహ్లీని ఆపటం ఎవరి తరం కాదు. ఇక కోపం వస్తే మాత్రం అంతేసంగతులు. అయితే కోహ్లీ ఇలా ప్రవర్తించడంపై సంచలన కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నిక్ కాంప్టన్. తన పట్ల కోహ్లీ దురుసగా ప్రవర్తించాడంటూ ట్విట్టర్ వేదికగా కోహ్లీ తీరును తప్పుపట్టాడు. ఇంతకీ కోహ్లీ చేసిన కామెంట్స్ ఏంటి.? నిక్‌ను అంతలా కామెంట్స్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది. ఇప్పుడు తెలుసుకుందాం.
‘కోహ్లీ నోరు తెరిస్తే అన్ని బూతు మాటలే..’ అంటూ ట్వీట్ చేశాడు నిక్ కాంప్టన్. 2012లో తనన్ను వేలెత్తి చూపుతూ చేసిన దూషణను మర్చిపోలేనని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. కోహ్లీ ప్రవర్తన కారణంగా తనను తానే తక్కువ చేసుకున్నాడని వ్యాఖ్యానించారు. కోహ్లీ తీరు చూస్తే.. జోరూట్, టెండూల్కర్, విలియమ్సన్ ఎంత హుందాగా ఉంటారో తెలుస్తోందని కాంప్టన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై కోహ్లీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నిక్ కాంప్టన్.. కామెంట్స్‌పై నిప్పులు చెరుగుతున్నారు టీమిండియా ఫ్యాన్స్. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం సరి కాదంటూ పలువురు నెటిజన్లు చురకలంటించారు. గతంలో అశ్విన్‌ను అండర్సన్ అవమానించినప్పుడు, వీడ్కోలు పోరులో ఫిలాండర్‌ను బట్లర్ దూషించినప్పుడు నువ్వెక్కడున్నావు.? అంటూ గతాన్ని గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. బుమ్రా బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు ఇదంతా మొదలుపెట్టింది ఇంగ్లాడే కదా అంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్. ముందు మీరు సరిగ్గా ఉండి.. ఆ తరువాత అవతలి వారిని విమర్శించండి అంటూ హితవుపలికారు.
Also read:
Shreyas Iyer: శ్రేయాస్.. క్యా షాట్ హై..! సోషల్‌మీడియాలో ఫుల్ వైరల్ వీడియో
చిన్నా పిల్లాడిలా ఆ ఏడుపు ఏంటి..?? టీకా సెంటర్‌లో యువకుడి హాంగామా.! వీడియో