T20 World Cup 2026 : టీమిండియాకు హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్..టీ20 వరల్డ్ కప్ ఏ దేశం ఎన్ని సార్లు కొట్టిందంటే ?
T20 World Cup 2026 : మరోసారి క్రికెట్ పండుగ వచ్చేసింది. పదో ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7, 2026 శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

T20 World Cup 2026 : మరోసారి క్రికెట్ పండుగ వచ్చేసింది. పదో ఎడిషన్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7, 2026 శనివారం నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈసారి కూడా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా పటిష్టంగా ఉంది. 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో సౌతాఫ్రికాను ఓడించి కప్పు గెలిచిన భారత్, ఇప్పుడు వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.
వివాదాల మధ్యే మొదలవుతున్న టోర్నీ
ఈసారి వరల్డ్ కప్ మొదలవ్వకముందే అనేక వివాదాలు చుట్టుముట్టాయి. భారత్ రావడానికి ఇష్టపడని బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు టోర్నీలోకి వచ్చింది. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్, భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తున్నట్లు ప్రకటించడం ఐసీసీకి తలనొప్పిగా మారింది. ఏదేమైనా, ఫిబ్రవరి 7న భారత్ తన తొలి మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. అదే రోజు పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య కూడా మ్యాచ్ జరగనుంది. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-డి ని గ్రూప్ ఆఫ్ డెత్‌గా పిలుస్తున్నారు, ఎందుకంటే ఇందులో సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ వంటి బలమైన జట్లు పోటీ పడుతున్నాయి.
హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్స్..మూడో కప్పుపై కన్ను
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్, వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లు చెరో రెండు సార్లు చాంపియన్లుగా నిలిచాయి. 2007లో ధోనీ కెప్టెన్సీలో తొలి కప్పు గెలిచిన భారత్, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 2024లో రెండో కప్పును ముద్దాడింది. ఇప్పుడు గనుక సొంత గడ్డపై మూడో టైటిల్ గెలిస్తే, మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పుతుంది. అయితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల నుంచి భారత్‌కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే హెచ్చరించాడు.
టీ20 వరల్డ్ కప్ విజేతల పూర్తి జాబితా (2007 – 2024)
2007: భారత్ (పాకిస్థాన్‌పై విజయం) – తొలి టీ20 ప్రపంచ విజేత.
2009: పాకిస్థాన్ (శ్రీలంకపై విజయం)
2010: ఇంగ్లాండ్ (ఆస్ట్రేలియాపై విజయం)
2012: వెస్టిండీస్ (శ్రీలంకపై విజయం)
2014: శ్రీలంక (భారత్‌పై విజయం)
2016: వెస్టిండీస్ (ఇంగ్లాండ్‌పై విజయం) – రెండోసారి కప్పు గెలిచిన తొలి జట్టు.
2021: ఆస్ట్రేలియా (న్యూజిలాండ్‌పై విజయం)
2022: ఇంగ్లాండ్ (పాకిస్థాన్‌పై విజయం) – ఇంగ్లాండ్‌కు ఇది రెండో టైటిల్.
2024: భారత్ (సౌత్ ఆఫ్రికాపై విజయం) – రోహిత్ శర్మ సారథ్యంలో భారత్‌కు రెండో కప్పు.
గ్రూపుల వివరాలు, టోర్నీ ఫార్మాట్
ఈ టోర్నీలో ప్రతి గ్రూప్ నుంచి టాప్-2 జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి నాలుగు జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.
గ్రూప్ B: ఆస్ట్రేలియా, శ్రీలంక ఫేవరెట్లు.
గ్రూప్ C: వెస్టిండీస్, ఇంగ్లాండ్ జట్లకు నేపాల్, ఇటలీ నుంచి పోటీ ఉంటుంది.
గ్రూప్ D (డేంజర్ జోన్): సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడా మధ్య భీకర పోరు జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి
