AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిడ్ రేంజ్ హీరోల గ్యాప్ ఇండస్ట్రీకి మంచిదేనా..?

మిడ్ రేంజ్ హీరోల గ్యాప్ ఇండస్ట్రీకి మంచిదేనా..?

Samatha J
|

Updated on: Feb 04, 2026 | 5:23 PM

Share

టాలీవుడ్‌లో మిడ్‌ రేంజ్‌ హీరోలు తమ సినిమాల మధ్య సుదీర్ఘ విరామాలు తీసుకుంటున్నారు. క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఈ గ్యాప్‌లు కెరీర్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా దుల్కర్ సల్మాన్, కార్తీ, ధనుష్ వంటి పరభాషా హీరోలు తెలుగు మార్కెట్‌లో పాగా వేస్తున్నారు. ఈ ట్రెండ్ సినీ విశ్లేషకులలో చర్చకు దారి తీస్తోంది.

టాలీవుడ్‌లో మిడ్‌ రేంజ్‌ హీరోలు తమ సినిమాల మధ్య అగ్రతారలకు దీటుగా సుదీర్ఘ విరామాలు తీసుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. క్వాలిటీ ముఖ్యం అంటూ ఈ హీరోలు ఒక్కో సినిమాకు రెండేళ్లకు పైగా సమయం వెచ్చిస్తున్నారు. అడివి శేష్ తన గూఢచారి 2, డెకాయిట్ సినిమాల కోసం 2026 వరకు గ్యాప్‌ తీసుకున్నారు. సాయి ధరమ్ తేజ్ 2023 జూలైలో బ్రో తర్వాత సంబరాల ఏటిగట్టు కోసం రెండున్నరేళ్లకు పైగా విరామం ఇస్తున్నారు. నవీన్ పొలిశెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్‌ తీసుకుని అనగనగా ఒక రాజు చిత్రంతో వచ్చారు. నిఖిల్ 2023లో స్పై తర్వాత 2026లో స్వయంభూతో రానున్నారు. తేజ సజ్జా కూడా ప్రతి సినిమాకు కనీసం రెండేళ్ల గ్యాప్‌ను కొనసాగిస్తున్నారు. ఈ సుదీర్ఘ విరామాల కారణంగా దుల్కర్ సల్మాన్, కార్తీ, ధనుష్ వంటి ఇతర భాషల హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

బిజీ రోడ్డుపై ఆటో స్టంట్స్.. పోలీసుల ముందే ఓవరాక్షన్‌!

ఈ ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ బాంబర్లు .. వీడియో

పొలాల్లో చిరుతలు.. వణుకుతున్న తర్లపాడు ప్రజలు

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో