కూకట్ పల్లికి చెందిన విజయలక్ష్మి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి కాలేదన్న బాధతో ఈ నిర్ణయం తీసుకుందని తొలుత భావించినా, దీర్ఘకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతూ మందులు వాడుతుందని పోలీసులు నిర్ధారించారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే ఆమె ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. కూకట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.