India Cricket: సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్.. వీర కుమ్ముడు కుమ్మిన ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్..

|

Dec 23, 2020 | 5:55 AM

భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ హడలెత్తించాడు.

India Cricket: సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్.. వీర కుమ్ముడు కుమ్మిన ముంబై బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్..
Follow us on

India Cricket: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ హడలెత్తించాడు. తన వీరోచిత బ్యాటింగ్‌తో రెచ్చిపోయిన సూర్యకుమార్.. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో చితకొట్టుడు కొట్టాడు. అతను వేసిన ఒక్క ఓవర్ లోనే 21 పరగులు రాబట్టాడు. దేశవాళీ టీ20లీగ్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం సన్నద్ధంలో భాగంగా ముంబై టీమ్-బీ, టీమ్-డీ మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ బీ టీమ్‌ను లీడ్ చేయగా.. యశస్వి జైస్వాల్ డీ ని లీడ్ చేశాడు. డీ టీమ్ తరఫున పేసర్‌గా అర్జున్ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో అర్జున్ టెండూల్కర్ 13వ ఓవర్ వేయగా.. సూర్యకుమార్ తన బ్యాట్‌ను ఝుళిపించాడు. వీర విహారంచేశాడు. మ్యాచ్ మొత్తంగా సూర్యకుమార్.. 47 బంతుల్లోనే 120 పరుగులు చేసి తానేంటో మరోసారి నిరూపించుకున్నాడు.

ఇదిలాఉండగా, ఐపీఎల్ -2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్య కుమార్.. అద్భుతమైన బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సూర్యకుమార్ టీమిండియా జట్టులో చోటు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాడు. సూర్యకుమార్ కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరును కనబరుస్తున్నప్పటికీ సెలెక్టర్లు మాత్రం అతనికి టీమిండియాలో చోటు కల్పించడం లేదు. మరి ఈ మ్యాచ్‌తో అయినా సూర్యకుమార్ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడేనా? లేదా? అని చూడాల్సిందే.

 

Also read:

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ర్యాలీ యువకుల హంగామా.. తల్వార్లతో హల్‌చల్ చేసిన కార్యకర్తలు

India Vs Australia 2020: భారత్-ఆస్ట్రేలియా సిరీస్ కు కరోనా సెగ.. ఆఖరి రెండు టెస్టుల వేదికల్లో మార్పులు.?