వన్డే వరల్డ్ కప్‌లో 44 ఏళ్ల పాటు నిరీక్షించి.. తమ నాలుగో ఫైనల్ మ్యాచ్ ప్రయత్నంలో కప్పు నెగ్గింది ఇంగ్లాండ్ జట్టు. ఇది ట్రేవర్ బేలిస్ కోచింగ్‌లో సాధ్యమైంది. ట్రేవర్ బేలిస్ కోచింగ్ స్కిల్స్, ఆయన సామర్థ్యంపై విశ్వాసం ఉంచిన ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ యాజమాన్యం ప్రధాన కోచ్‌గా నియమించింది. ఇంగ్లాండ్‌కు ప్రపంచ కప్ అందించిన కోచ్ ట్రేవర్ బేలిస్‌ను సన్‌రైజర్స్ జట్టు హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో పత్రికా ప్రకటనను పోస్ట్ చేసింది. బేలిస్ ఇదివరకే ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టుకు రెండు ట్రోఫీలు అందించిన విషయం తెలిసిందే. ఆయన కోచింగ్‌లోనే సిడ్నీ సిక్సర్స్ జట్టు ఛాంపియన్స్ లీగ్, బిగ్ బాష్ లీగ్ లాంటి కీలకమైన ట్వంటీ20 టోర్నీలలో ఛాంపియన్‌గా నిలిచింది. ఎన్నో విజయాలు అందించిన సక్సెస్ ఫుల్ కోచ్ నైపుణ్యంపై తమకు నమ్మకం ఉందని, హైదరాబాద్ జట్టును మరింత ముందుకు తీసుకెళ్తారని సన్ రైజర్స్ ధీమా వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ కోచ్‌గా సేవలు అందించిన టామ్ మూడీకి మేనేజ్‌మెంట్ ధన్యవాదాలు తెలిపింది.
?Announcement?
Trevor Bayliss, England's WC Winning coach, has been appointed as the new Head Coach of SunRisers Hyderabad. #SRHCoachTrevor pic.twitter.com/ajqeRUBym5
— SunRisers Hyderabad (@SunRisers) July 18, 2019