AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవాస్కర్ ఓ చెత్త ఆటగాడు… కిరణ్ మోరే కామెంట్స్

Sunil Gavaskar one of the Worst Player : భారతీయ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పై భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు చేశారు. గవాస్కర్‌ చెత్త ఆటగాడంటూ కామెంట్స్ చేశారు. ప్రపంచ దేశాలను తన బ్యాట్‌తో చుక్కలు చూపించిన లిటిల్ మాస్టర్ పై అతని సహచర ఆటగాడు ఇలా మాటల తూటలు పేల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ మోరే ఈ వ్యాఖ్యలు చేశారు. […]

గవాస్కర్ ఓ చెత్త ఆటగాడు... కిరణ్ మోరే కామెంట్స్
Sanjay Kasula
|

Updated on: Jul 04, 2020 | 5:15 PM

Share

Sunil Gavaskar one of the Worst Player : భారతీయ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పై భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే సంచలన వ్యాఖ్యలు చేశారు. గవాస్కర్‌ చెత్త ఆటగాడంటూ కామెంట్స్ చేశారు. ప్రపంచ దేశాలను తన బ్యాట్‌తో చుక్కలు చూపించిన లిటిల్ మాస్టర్ పై అతని సహచర ఆటగాడు ఇలా మాటల తూటలు పేల్చడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ మీడియాతో మాట్లాడుతూ కిరణ్ మోరే ఈ వ్యాఖ్యలు చేశారు.

కిరణ్ మోరే మాట్లాడుతూ… మైదానంలో ప్రత్యర్థి బౌలర్లను గవాస్కర్ దీటుగా ఎదుర్కొని పరుగుల వరద పారించేవాడు. కానీ నెట్ ప్రాక్టీస్‌లో మాత్రం ఒక్కో బంతిని ఎదుర్కోవడానికి తెగ ఇబ్బంది పడేవాడు. నెట్స్‌లో గవాస్కర్ ఆటను చూస్తే అసలు ఇతడు అంతర్జాతీయ ఆటగాడేనా.. అనే అనుమానం కూడా కలుగుతుంది. నాకు తెలిసి నెట్స్‌లో అత్యంత చెత్త ఆటగాడు గవాస్కరే’ అంటూ చెప్పుకొచ్చారు.

అయితే నెట్స్‌లో ప్రాక్టీస్ చేయడం గవాస్కర్‌కు అస్సలు ఇష్టం ఉండదని… గవాస్కర్ నెట్స్ లో ఆడే తీరుకు మైదనంలో ఆడే తీరుకు చాలా తేడా ఉంటుందన్నారు. ఇలా అంటూనే మరోవైపు గవాస్కర్ ఆటతీరుపై ప్రశంసలు కురించారు. గవాస్కర్ గొప్ప ఆటగాడని.. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన బౌలర్లకు చుక్కలు చూపించిన మేటి ఆటగాడు అని అన్నారు.