బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ…!

| Edited By:

Oct 14, 2019 | 3:51 PM

మాజీ టీమిండియా కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు తాజాగా ముంబయిలో సమావేశమై అధ్యక్షుడిగా దాదా పేరుని ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే.. అతనికి బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ బృందం నుంచి గట్టి పోటీ […]

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ...!
Follow us on

మాజీ టీమిండియా కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా ఎన్నికవడం దాదాపు ఖాయమైంది. బీసీసీఐ సభ్యత్వం ఉన్న రాష్ట్ర క్రికెట్ సంఘాలు తాజాగా ముంబయిలో సమావేశమై అధ్యక్షుడిగా దాదా పేరుని ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా‌తో సమావేశమైన సౌరవ్ గంగూలీ.. బీసీసీఐ అధ్యక్షుడిగా తాను ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. అయితే.. అతనికి బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్ బృందం నుంచి గట్టి పోటీ ఎదురైంది. కానీ.. ఎట్టకేలకి వ్యూహాత్మకంగా అందరి మద్దతు కూడగట్టిన గంగూలీ.. అధ్యక్ష పదవి రేసులో ముందు నిలిచాడు.

ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్‌… బోర్డు అధ్యక్షుడిగా 2020 సెప్టెంబర్ వరకు మాత్రమే కొనసాగగలడు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం అతను ‘విరామం’ తీసుకోక తప్పదు. ఎందుకంటే కొత్త నిబంధనల ప్రకారం.. బీసీసీఐలో రెండు పర్యాయాలు ఏ పదవులైనా చేపట్టిన తర్వాత సభ్యులు కనీసం మూడేళ్లు విరామం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, బోర్డులో లోధా కమిటీ సిఫార్సుల అమలు, క్రికెట్ పాలకుల కమిటీ అతి జోక్యంతో గాడి తప్పిన బీసీసీఐ పాలనని గంగూలీ అయితేనే మళ్లీ గాడిన పెట్టగలడని రాష్ట్ర క్రికెట్ సంఘాలు పక్కా వ్యూహంతో.. అతడికి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.