T20 WORLD CUP: ఫ్రీ హిట్ బాల్ లో బ్యాట్స్ మెన్ అవుట్ అయితే పరుగులు తీయోచ్చా.. క్లారిటీ ఇచ్చిన మాజీ అంఫైర్..

|

Oct 24, 2022 | 9:07 PM

టీ 20 ప్రపంచకప్ లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా చివరి ఓవర్ లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఓవర్ లో అంఫైర్ల నిర్ణయంపైనా తీవ్రమైన చర్చ..

T20 WORLD CUP: ఫ్రీ హిట్ బాల్ లో బ్యాట్స్ మెన్ అవుట్ అయితే పరుగులు తీయోచ్చా.. క్లారిటీ ఇచ్చిన మాజీ అంఫైర్..
Ind Vs Pak Match
Follow us on

టీ 20 ప్రపంచకప్ లో భారత్- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ముఖ్యంగా చివరి ఓవర్ లో చోటుచేసుకున్న నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆ ఓవర్ లో అంఫైర్ల నిర్ణయంపైనా తీవ్రమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా నోబాల్ తర్వాత ఫ్రీ హిట్ బాల్ లో బ్యాట్స్ మెన్ అవుట్ అయితే పరుగులు తీయోచ్చా లేదా అనే సందేహం చాలామందిలో నెలకొంది. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఫ్రీ హిట్ బాల్ లో బౌల్డ్ అయి బాల్ గ్రౌండ్ లోకి వెళ్లిన తర్వాత మూడు పరుగులు తీశాడు. అంఫైర్ లెగ్ బైస్ సిగ్నల్ ఇస్తూ మూడు పరుగులు ఇచ్చారు. అంఫైర్ నిర్ణయంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. కొంతమంది అంఫైర్ నిర్ణయాన్ని సమర్థించగా, మరికొందకరు అంఫైర్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అయితే ఈ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ అంఫైర్ సైమన్ టౌఫెల్ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. అలాగే అంఫైర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు.

T20 ప్రపంచ కప్ లో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్‌ జట్టుపై కోహ్లి మంచి నాక్ ఆడటంతో భారత్ నాలుగు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. చివరి ఓవర్ లో ఫ్రీహిట్ బంతికి బైల్డ్ అయిన తర్వాత పరుగులు తీయడంపై అనేకమంది తమ అభిప్రాయాలను పంచుకుంటున్న క్రమంలో.. ఈ వివాదంపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు సైమన్ టౌఫెల్.
ఈ వివాదంపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకుంటూ, ఫ్రీ హిట్‌ బాల్ లో బౌల్డ్ అయిన తర్వాత కోహ్లీ మూడు పరుగులు తీసి మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడని, అయితే ఫ్రీహిట్ బంతికి బౌల్డ్ అయిన తర్వాత ఈ వివాదంపై స్పందించాలని తనను చాలా మంది సోషల్ మీడియా వేదికగా కోరారని, దీంతో దీనిపై తన అభిప్రాయాన్ని చెప్పనున్నట్లుత తెలిపారు.అయితే ఈ సందర్భంగా అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని సైమన్ టౌఫెల్ సమర్థించారు.

మ్యాచ్ లో అంపైర్లు ఎందుకు సరైన నిర్ణయం తీసుకున్నారో కూడా వివరించాడు సైమన్ టౌఫెల్. బంతి స్టంప్‌లను తాకిన తర్వాత గ్రౌండ్ లోకి వెళ్లిందని, దీంతో బ్యాట్స్ మెన్స్ మూడు పరుగులు చేసిన తర్వాత బైస్‌ని సూచించడంలో అంపైర్ సరైన నిర్ణయం తీసుకున్నారని టౌఫెల్ తెలిపారు. ఫ్రీ హిట్ బాల్ లో స్ట్రైకర్‌ని ఔట్ చేయడం కుదరదు కాబట్టి స్టంప్‌లను తాకినప్పుడు బాల్ డెడ్ అవ్వదని గుర్తు చేశారు. అందుకే అంఫైర్ తీసుకున్న నిర్ణయం సరైపదేనని టౌఫెల్ అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం చూడండి..