vijay hazare trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో విజృంభించిన యూపీ బౌలర్.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టేశాడు..

|

Feb 24, 2021 | 10:23 PM

vijay hazare trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌ టీమ్ బౌలర్ శివం శర్మ(27) చెలరేగిపోయాడు.

vijay hazare trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో విజృంభించిన యూపీ బౌలర్.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టేశాడు..
Follow us on

vijay hazare trophy 2021: విజయ్ హజారే ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌ టీమ్ బౌలర్ శివం శర్మ(27) చెలరేగిపోయాడు. తన బౌలింగ్‌తో విజృంభించాడు. ఏకంగా ఏడు వికెట్లు తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. అంతేకాదు.. మొత్తం 10 ఓవర్లు వేసిన శివం శర్మ.. కేవలం 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా బుధవారం నాడు ఉత్తరప్రదేశ్‌, బిహార్ మధ్య మ్యాచ్ జరిగింది. ఢిల్లీ వాసి అయిన శివం శర్మ.. ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో శివం శర్మ విజృంభించడంతో బిహార్ జట్టు నిర్ణీత ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో శివం శర్మ పేరు.. చాలా ఏళ్ల తరువాత మళ్లీ మారుమోగుతోంది. శివం శర్మ ఎవరనేది చాలా మందికి తెలియదు కానీ.. అతను యువరాజ్ సింగ్, అల్బీ మెర్కెల్ వంటి దిగ్గజ బ్యాట్స్‌మెన్ వికెట్లను పడగొట్టిన చరిత్ర అతనిది. టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌తో శివం శర్మకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆ సంబంధం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ జట్టులో శివం శర్మ కూడా ఉన్నాడు. శివం ఆల్ రౌండర్, కుడి చేతి బ్యాట్స్‌మెన్ అయిన శివం.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. ఢిల్లీ అండర్-19, నార్త్ జోన్ అండర్-19 జట్లకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించాడు. 2014 సంవత్సరంలో శివంను ఐపీఎల్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ .10 లక్షలకు దక్కించుకుంది. ఐపీఎల్‌లో శివం శర్మ.. మే 9, 2014 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తొలి మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో శివం శర్మ రెండు పరుగులు మాత్రమే చేసినా.. బౌలింగ్‌లో రాణించాడు. నాలుగు ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చిన అతను.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ రెండు వికెట్లు కూడా యువరాజ్ సింగ్, ఆల్బీ మోర్కెల్ వి కావడం విశేషం. యువరాజ్‌ అప్పట్లో ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అతన్ని కట్టడి చేయడంతో శివం శర్మ పేరు అప్పుడు కాస్త హైలైట్ అయ్యింది. అలా.. యూవీ వికెట్‌ను తీసుకోవడం శివం శర్మ ఇప్పటికీ గుర్తుచేసుకుంటాడు.

Also read:

సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు.. హిందూ మహిళ తన ఆస్తిని పుట్టింటి సభ్యులకు ఇవ్వోచ్చు..

రాజన్నకు వెన్నుదన్నుగా ఉన్న నేత రాజకీయాలు వదిలేశారు.. పార్టీయే సర్వం అనుకున్నవారే సైలెంట్ అయ్యారు.. రఘువీరా అజ్ఞాతవాసం అసలు కథ..!