SFA Championships 2024: ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 7వ రోజు హైలెట్స్ ఇవే..

హైదరాబాద్ వేదికగా పలు స్టేడియంలలో జరుగుతున్న SFA ఛాంపియన్ షిప్ పోటీలు ఏడో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు 'ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్' అనే థీమ్‌తో యువ క్రీడాకారులు పోటాపోటీగా తలపడ్డారు. ఈ ప్రదర్శనలు చూసేందుకు అధిక సంఖ్యలో జనాలు తరలివచ్చారు.

SFA Championships 2024:  ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 7వ రోజు హైలెట్స్ ఇవే..
SFA Championships 2024
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 22, 2024 | 9:05 PM

టాలెంట్ ఉండి.. అవకాశాలు దొరక్క వెనకబడిన ఆటగాళ్లకు పుష్ ఇవ్వడానికి…  టీవీ9 నెట్ వర్క్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఫుట్‌బాల్‌ టాలెంట్‌‌కు ఫుష్ అప్ ఇవ్వడానికి ఇండియన్‌ టైగర్స్‌, టైగ్రెసెస్‌.. టాలెంట్‌ హంట్‌ కార్యక్రమాన్ని చేపట్టింది.. ఇండియన్‌ టైగర్స్‌ , టైగ్రెసెస్‌.. టాలెంట్‌ హంట్‌తో 20 మంది బాలురు.. 20 మంది బాలికలను ఎంపిక చేసి ఆస్ట్రియ , జర్మనీలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. TV9 నెట్‌వర్క్ “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్” ఈ విప్లవాత్మక ప్రచారం కోసం దేశంలోని అతిపెద్ద గ్రాస్‌రూట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన SFAతో టై అప్ అయింది. ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ తోపాటు.. స్పోర్ట్స్ ఫర్ ఆల్ (SFA) సంయుక్తంగా దేశంలోని ఫుట్‌బాల్ క్రీడాకారులకు సహకారం అందించడంతోపాటు.. అత్యుత్తమ టాలెంట్‌ను వెలుగులోకి తీసుకువచ్చేందుకు టీవీ9, SFA మొక్కవోని దీక్షతో ముందకు సాగుతున్నాయి.

భారత్‌లోని నంబర్ 1 న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 – News9 “ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్స్”.. హంట్ ద్వారా.. బుండెస్లిగా, DFB-పోకల్, ఇండియా ఫుట్‌బాల్ సెంటర్, IFI, BVB, RIESPOలతో కలిసి.. ఫుట్ బాల్‌లో టాలెంట్ ఉన్న  టీవీ9 పనిచేస్తోంది.  . దీనిలోని విజేతలను 2025 ప్రారంభంలో జర్మనీలో సత్కరించడంతోపాటు.. ట్రైనింగ్ ఇవ్వనున్నారు.

Indian Tigers And Tigresses

Indian Tigers And Tigresses Hunt

ప్రజంట్ హైదరాబాద్‌లోని జరుగుతున్న SFA ఛాంపియన్‌షిప్స్ 2024 ద్వారా టీవీ9 టాలెంట్ ఉన్నవారికి మరో మంచి అవకాశాన్ని ఇస్తుంది.. SFA ఛాంపియన్‌షిప్స్ 2024, 7వ రోజున హైదరాబాద్‌లో యువ అథ్లెట్లు చెలరేగిపాయారు. గచ్చిబౌలి స్టేడియంలో పిల్లలు బాస్కెట్‌బాల్, చెస్‌లలో తమ నైపుణ్యాలను ప్రదర్శించగా, హ్యాండ్‌బాల్, వాలీబాల్‌లో పలువరు తమ ప్రతిభను ప్రదర్శించారు. హ్యాండ్‌బాల్, వాలీబాల్‌లు 1, 2 రౌండ్‌లతో ప్రారంభమయ్యాయి. అయితే చెస్ U-11 బాలుర విభాగంలో పలు టఫ్ కాంపిటీషన్స్ నడిచాయి.

అథ్లెటిక్స్ మొదటి రోజు లాంగ్ జంప్, షాట్‌పుట్‌తో పాటు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 100 మీటర్ల పరుగు పందెం అద్భుతమైన ఫైనల్స్‌తో ముగిసింది. విగ్నన్స్ బో ట్రీ స్కూల్‌కు చెందిన హర్వీష్ శ్రీ చిరికి బాలుర U-12 లాంగ్ జంప్‌లో స్వర్ణం సాధించి స్కూల్ లీడర్‌బోర్డ్‌లో తన పాఠశాల అగ్ర ర్యాంక్‌ను కొనసాగించడంలో సాయపడ్డాడు.

కాగా, గ్లెన్‌డేల్ అకాడమీ సన్‌సిటీకి చెందిన ఒమర్ అలీ అండర్-18 షాట్‌పుట్ (5 కేజీలు) విభాగంలో బాలుర విభాగంలో స్వర్ణం సాధించాడు. బాలికల విభాగంలో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన శ్రీ సాయి అనన్య ఒడియాల అండర్-12 లాంగ్ జంప్‌లో స్వర్ణం సాధించింది. డేస్ 2, 3 అథ్లెటిక్స్‌లో మరిన్ని అద్భత విజయాలు నమోదయ్యే అవకాశం ఉంది. 100మీ స్ప్రింట్ ఫైనల్స్‌పై చాలామందికి ఆసక్తి ఉంది.

శ్రీ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో, ప్రేక్షకులు ఉత్కంఠభరితమైన తైక్వాండో బౌట్‌లు, బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్స్‌ను వీక్షించారు. తైక్వాండోలో బాలుర అండర్-14 విభాగంలో ది ఇంటిగ్రల్ స్కూల్‌కు చెందిన సల్మాన్ మాలిక్, బాలికల అండర్-14 విభాగంలో న్యూటన్ హైస్కూల్ (మోతీనగర్)కు చెందిన తిరుమణి గెలుపొందారు.

ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి వేదికగా మారింది.. అంతేకాకుండా.. వారి స్కూల్స్ పేరు ప్రపంచానికి చాటే అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ మ్యాచ్‌లను SFA అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి.