Paralympic: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం.. రజతం సొంతం చేసుకున్న నిషాద్‌ కుమార్‌.

|

Aug 29, 2021 | 5:52 PM

Paralympic: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చే చేరింది. పురుషుల హైజంప్‌ పోటీలో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌...

Paralympic: పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం.. రజతం సొంతం చేసుకున్న నిషాద్‌ కుమార్‌.
Silver Medal
Follow us on

Paralympic: టోక్యో వేదికగా జరుగుతోన్న పారాలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం వచ్చే చేరింది. పురుషుల హైజంప్‌ పోటీలో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ రజత పతకం సాధించాడు. ఈ పోటీలో నిషాద్‌ రెండో స్థానంలో నిలిచాడు. 2.06 మీటర్ల ఎత్తు జంప్‌ చేసిన నిషాద్‌ పతకం సొంతం చేసుకున్నాడు.

భారత్‌కు ఆదివారం ఇది రెండో పతకం కావడం విశేషం. నిషాద్‌ కంటే ముందు మహిళల టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో భారత్‌ తరఫున పాల్గొన్న భవీనా పటేల్‌ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో పారాలింపిక్స్‌లో ఒకేరోజు రెండు పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి.

అభినందనలు తెలిపిన మోదీ..

పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని సొంతం చేసుకున్న అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘టోక్యో నుంచి ఎంతో సంతోషకరంగా వార్త వచ్చింది. మెన్స్‌ హై జంప్‌ టీ47 విభాగంలో నిషాద్‌ కుమార్‌ రజతం సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నిషాద్‌ అద్భుత నైపుణ్యం ఉన్న మంచి అథ్లెట్‌’ అంటూ పేర్కొన్నారు.

Also Read: PV Sindhu: శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారిని దర్శించి.. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న పీవీ సింధు