Sanjana Ganesan- Jasprit Bumrah: టీమిండియా క్రికెటర్ జస్‌ప్రీత్ బుమ్రా, టీవీ ప్రెజెంటర్ సంజన గణేషన్ వివాహం జరిగి గురువారానికి ఒక నెల పూర్తయ్యింది. అయితే, వారి వారి విధుల్లో బిజీగా ఉండటంతో ఈ వేడుకను వారిద్దరూ మిస్ అయ్యారు. కానీ, వారిద్దరూ ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుచుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ పరీ మ్యాచ్ షోను హోస్ట్ చేస్తున్న సంజన.. బుమ్రాతో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది. వీరి వివాహం జరిగి నెల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ పోస్ట్ చేసిన సంజన.. ‘ఈ ప్రత్యేక రోజున భర్తను, ఆ కేక్‌ను కొంచెం మిస్ అయ్యాను’ అని క్యాప్షన్ పెట్టింది.
అంతకుముందు రోజు, ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా కూడా తన భార్య సంజనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్ చేశాడు. తన భార్యతో కలిసి ఉన్న ఒక పిక్‌ను పోస్ట్ చేసిన బుమ్రా.. ‘నెల రోజుల ప్రేమ.. పొట్టచక్కలయ్యే నవ్వులు.. వెర్రి జోకులు.. ఎన్నో ముచ్చట్లు.. ప్రశాంతత.. నా బెస్ట్ ఫ్రెండ్‌లో వివాహం జరిగి నెల రోజులు పూర్తయ్యింది.’ అంటూ క్యాప్షన్ పెట్టాడు.
ముంబై ఇండియన్స్ జట్టుతో సభ్యుడైన బుమ్రా ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. మొదటి ఐదు లీగ్ ఆటలను ఆడనున్నాడు. 2016న అంతర్జాతీయ ప్రయాణం ప్రారంభించిన బుమ్రా.. అప్పటి నుంచి టీమిండియాలో కీలక ఆటగాడిలా నిలిచాడు. టీమిండియా తరఫున 19 టెస్టులు, 67 వన్డేలు, 50 టీ20 ఆడాడు. బుమ్రా 111 వికెట్లు పడగొట్టాడు. గతేడాది ఐపీఎల్ ట్రోఫీలో 27 వికెట్లు పడగొట్టిన బుమ్రా.. ఆ ట్రోపీ ముంబై ఇండియన్స్ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
Sanjana Ganeshan Post
Also read: