భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు షేర్ చేస్తోంది. పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో విడిపోవడం, ఆ వెంటనే పాక్ నటి సనా జావేద్ తో షోయబ్ పెళ్లిపీటలెక్కడం సానియాను బాగా కుంగదీశాయని చెప్పుకోవచ్చు. అందుకే తనకు తాను ధైర్యం చెప్పుకుంటోందీ టెన్నిస్ క్వీన్. భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి తన కుమారుడితో కలిసి దుబాయ్‌లోనే ఉంటోంది సానియా. షోయబ్ తో విడాకుల గురించి ఏనాడూ డైరెక్టుగా ప్రస్తావించని సానియా నెట్టింట మాత్రం కొన్ని ఆసక్తికరమైన పోస్టులు షేర్ చేస్తోంది. ఇవి నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అలా తాజాగా ఇన్ స్టాలో మరొక పోస్ట్ పెట్టింది సానియా. ‘మృదువుగానే ఉండండి. మిమ్మల్ని బాధపెట్టిన విషయాలు మిమ్మల్ని మీరు కాని వ్యక్తిగా మార్చే అవకాశం ఇవ్వొద్దు’ అంటూ ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ పెట్టిందీ టెన్నిస్ క్వీన్. అయితే దేనిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందో క్లియర్ గా తెలియదు కానీ విడాకుల అనంతరం తనకు తాను ధైర్యం చెప్పుకునేందుకే ఇలా పోస్ట్ పెట్టిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2010లో వివాహం చేసుకున్నారు. వీరికి 2018లో ఇజాన్ మీర్జా మాలిక్ అనే కుమారుడు జన్మించాడు.
భారత క్రీడా చరిత్రలో సానియా మీర్జాకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. టెన్నిస్ లో ఆమె ప్రయాణం, విజయాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా బిడ్డను కన్న తర్వాత కూడా అంతర్జాతీయ టెన్నిస్ లో సానియా రాణించిన తీరు అమోఘం. ఇవి ఆమె పట్టుదల, మనో నిబ్బరానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే. టెన్నిస్ సంగతి పక్కన పెడితే.. సానియా వ్యక్తిగత జీవితం ఒడిదొడుకుల మయం. అప్పట్లో షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో చాలామంది ఆమెను దూషించారు. ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో మళ్లీ ఆమె పర్సనల్ లైఫ్ వార్తల్లోకి వచ్చింది.
Sania Mirza Instagram Story pic.twitter.com/zRNB8kezUr
— Akash Kharade (@cricaakash) March 4, 2024
Three legendary Indian players have etched their names in the history books of BNP Paribas Open
Read more about the Indian history at the Indian Wells Masters 👇@MirzaSania | @rohanbopanna | @Leander https://t.co/o8LsQs8ftw
— Indian Tennis Daily (ITD) (@IndTennisDaily) March 2, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..