Sania Mirza: భర్త గురించి ఓపెన్‌ అయిన సానియా.. షోయబ్‌లో నచ్చనిది అదేనంటూ..

|

Mar 17, 2022 | 5:25 PM

Sania Mirza: భారత టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో ఎన్నో అసాధారణ విజయాలను అందుకున్న సానియా.. గ్రాండ్‌స్లామ్ గెలిచిన మొదటి భారతీయ...

Sania Mirza: భర్త గురించి ఓపెన్‌ అయిన సానియా.. షోయబ్‌లో నచ్చనిది అదేనంటూ..
Sania Mirza
Follow us on

Sania Mirza: భారత టెన్నిస్‌ సంచలనం సానియా మీర్జా ఈ ఏడాది మొదట్లో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ తర్వాత ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తన కెరీర్‌లో ఎన్నో అసాధారణ విజయాలను అందుకున్న సానియా.. గ్రాండ్‌స్లామ్ గెలిచిన మొదటి భారతీయ మహిళ టెన్నిస్ క్రీడాకారిణిగా పేరు సంపాదించుకున్నారు.దాదాపు 91 వారాల పాటు డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్‌గా కొనసాగారు. ఇలా క్రీడా రంగంలో ఎన్నో అత్యున్నత స్థానాలను చేరుకున్న సానియా ప్రస్తుతం కుటుంబంతో గడుపుతున్నారు. స్టార్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్న సమయంలోనే సానియా పాకిస్థానీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ను ఏప్రిల్‌ 12, 2010న వివాహం చేసుకున్నారు. వీరికి ఇజాన్‌ మీర్జా మాలిక్‌ అనే కుమారుడు ఉన్నారు.

ఇక అటు షోయబ్‌ ఇటు సానియా ఎంత బిజీగా ఉన్నా సరదాగా గడుపుతుంటారు. విహారయాత్రలకు వెళుతూ వాటికి సంబంధించి ఫోటోలను నెట్టింట పోస్ట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ జంట కలిసి ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా సానియా తన భర్త గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షోయబ్‌లో మీకు నచ్చని అంశం ఏంటని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సానియా స్పందిస్తూ.. ‘షోయబ్‌ చాలా ఓపికతో ఉంటాడు. ఇది నాకు నచ్చదు’ అని చెప్పుకొచ్చింది.

ఇంతకీ షోయబ్‌ ఈ లక్షణం ఎందుకు నచ్చదని ప్రశ్నించగా.. ‘నేను షోయబ్‌ని ఏదైనా చేయమని అడిగితే.. అతను ఎల్లప్పుడూ ‘నేను చేస్తాను’ అంటూ నిర్లక్ష్యంతో బదులిస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు సానియా. దీనిపై షోయబ్‌ స్పందిస్తూ.. ‘నేను చేయాల్సిన పనిని సరైన సమయానికి చేస్తాను’ అని బదులిచ్చారు. ఇక షోయబ్‌లో నచ్చని మరో అంశం గురించి చెబుతూ..’షోయబ్‌ రాత్రి పూట గురక పెడతారు’ అని చెప్పుకొచ్చారు. దీనికి షోయబ్‌ స్పందిస్తూ.. ‘నేను బాగా అలసిపోయినప్పుడు మాత్రమే గురక పెడతాను’ అని చెప్పుకొచ్చాడు. ఇలా ఇంటర్వ్యూ సరదాగా సాగింది.

Also Read: Explained: త్వరలో గుడ్‌న్యూస్.. దేశంలో తగ్గనున్న పెట్రో ధరలు.. దీనికి కారణం ఏంటో తెలుసా?

Krishna District: యాక్షన్‌లోకి దిగిన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్.. వారికి వాటర్, డ్రైనేజీ కనెక్షన్లు కట్

Russia-Ukraine War: రష్యాపై అగ్రరాజ్యం ఆగ్రహం.. ఇవాళ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసర సమావేశం..