‘ధోనీ’ నీవు రియల్ హీరో- సాయితేజ్

ధోనీ నువ్వు నిజమైన హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తారు మెగా హీరో సాయితేజ్. టీమిండియా కెప్టెన్‌గా దేశానికి ఎన్నో విలువైన విజయాలను అందించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ..

ధోనీ నీవు రియల్ హీరో- సాయితేజ్

Updated on: Jul 07, 2020 | 1:02 PM

Saitej Wishes to Legend MSDhoni : ధోనీ నువ్వు నిజమైన హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తారు మెగా హీరో సాయితేజ్. టీమిండియా కెప్టెన్‌గా దేశానికి ఎన్నో విలువైన విజయాలను అందించిన నాయకుడు మహేంద్ర సింగ్ ధోనీ అని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టీమిండియాను మేటి జట్టుగా తీర్చిదిద్దిన సారథి కూడా ధోనీ అంటూ పేర్కొన్నారు. ధోనీ సారథ్యంలోనే టీమిండియా రెండు ప్రపంచకప్‌లను చేజిక్కించుకుంది. ఎంతో మంది ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ధోనీకి నా ప్రత్యేకమైన అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

2011 ప్రపంచకప్‌లో భారత్‌‌ను విజేతగా నిలపడం దగ్గర్నుంచి ఎన్నో క్రికెట్ రికార్డులను బ్రేక్ చేశావు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచావు. దిగ్గజ ఆటగాడికి, నిజమైన నాయకుడికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే ధోనీ` అంటూ సాయితేజ్ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ధోనీకి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు.