క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రజంట్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ఇటీవల అక్కడ కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. వేల సంఖ్యలో మూగ జీవాలు బలయ్యాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు నిరాశ్రయిలయ్యారు. దీంతో అక్కడి క్రికెట్ లెజెండ్స్ భాదితులకు నిధులు ఇవ్వడానికి ఓ ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్ క్రిస్ట్ ఎలెవన్, పాంటింగ్ ఎలెవన్ జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్‌లోనే సచిన్ కూడా మెరిశాడు.
అంతేనా ఇన్నింగ్స్ బ్రేక్ అప్పుడు..బ్యాట్ పట్టి గ్రౌండ్‌లోకి దిగి..అభిమానులను అలరించాడు. ఆసిస్ యూనిఫాం ధరించిన మాస్టర్ బ్లాస్టర్..ఫిమేల్ బౌలర్ ఎలిస్ పెర్రీ బౌలింగ్‌లో కాసేపు తన బ్యాటింగ్ విన్యాసాలతో మెస్మరైజ్ చేశాడు. గడిచిన 5 ఏళ్లలో సచిన్ బ్యాట్ పట్టడం ఇదే తొలిసారి. ఓ మంచి కార్యక్రమంలో భాగమైన సచిన్ మంచి మనుసును ప్రైజ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.
Ellyse Perry bowls ? Sachin Tendulkar bats
This is what dreams are made of ?pic.twitter.com/WksKd50ks1
— ICC (@ICC) February 9, 2020