చివరి ఓవర్లో 22 పరుగులు.. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించిన రిషబ్ పంత్..

|

Dec 12, 2020 | 9:51 PM

సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషన్ పంత్ తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 73 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు.

చివరి ఓవర్లో 22 పరుగులు.. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించిన రిషబ్ పంత్..
Follow us on

సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా-ఏ జట్టుతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషన్ పంత్ తన బ్యాట్‌ను ఝుళిపించాడు. 73 బంతుల్లోనే సెంచరీని పూర్తి చేశాడు. అయితే మ్యాచ్‌ చివరి ఓవర్‌లో పంత్ రెచ్చిపోయి ఆడాడు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ బాది ఒక్క ఓవర్లోనే 22 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టును హడలెత్తించాడు. చివరి ఓవర్ సమయానికి పంత్ 67 బంతుల్లో 81 పరుగులు చేశాడు. సెంచరీ చేయడానికి ఇంకా 19 పరుగులు చేయాల్సి ఉంది. అయితే మిగిలింది మరొక్క ఓవర్ మాత్రమే. అటునుంచి చివరి ఓవర్ బౌలింగ్‌కు పేసర్ జాక్ విల్డర్‌మత్ వచ్చాడు. చివరి ఓవర్లో పంత్ రెచ్చిపోయి ఆడాడు. ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో జాక్‌కు షాక్ ఇచ్చాడు పంత్. అలా తన షాకింగ్ ఫర్మార్మెన్స్‌తో 73 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు పంత్.