ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ లవ్ ట్రాక్!

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ స్పోర్ట్స్ లవర్స్ అందరికి సుపరిచితుడే.  అలవోకగా సిక్సులు బాదుతూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చెయ్యడం అతడి స్టైల్. ఇప్పుడు ఈ క్రేజీ ప్లేయర్ లవ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మన భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్​తో అట. ఇప్పుడు ఆస్ట్రేలియా వీధుల్లో ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ […]

ఇండియన్ గర్ల్‌తో మ్యాక్స్‌వెల్ లవ్ ట్రాక్!
Indian-born lady Vini Raman and the Aussie all-rounder are reportedly dating for a long time

Edited By:

Updated on: Aug 29, 2019 | 2:33 PM

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్ స్పోర్ట్స్ లవర్స్ అందరికి సుపరిచితుడే.  అలవోకగా సిక్సులు బాదుతూ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చెయ్యడం అతడి స్టైల్. ఇప్పుడు ఈ క్రేజీ ప్లేయర్ లవ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మన భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్​తో అట. ఇప్పుడు ఆస్ట్రేలియా వీధుల్లో ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తున్నారని టాక్ నడుస్తోంది. అయితే వీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఒకవేళ మ్యాక్స్​వెల్​, విని రామన్ ఒక్కటైతే భారత అమ్మాయిని పెళ్లాడిన రెండో ఆసీస్ క్రికెటర్​గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్​ టైట్ భారత యువతినే పెళ్లాడాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ అనంతరం ఆమెను వివాహం చేసుకున్నాడు. కాగా ఇటీవలే పాకిస్థాన్ క్రికెటర్ అసన్ అలీ కూడా భారత అమ్మాయినే పెళ్లాడటం విశేషం.