కోచ్‌గా మరోసారి రవిశాస్త్రి ఫిక్స్!

టీమిండియా కోచ్ ఎంపిక దాదాపు పూర్తయ్యింది. మరోసారి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే పదవి దక్కింది. ఆరుగురిని ఇంటర్వ్యూలకు పిలిచిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ… చివరకు శాస్త్రినే కోచ్​గా ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత కెప్టెన్ కోహ్లీ మొదట్నుంచి రవిశాస్త్రికే ఫేవర్‌గా ఉన్నాడు. తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, మైక్ హెసన్, రాబిన్ సింగ్​, లాల్​చంద్ రాజ్​పుత్​లకు నిరాశే మిగిలింది. జట్టుతో పనిచేయడం […]

కోచ్‌గా మరోసారి రవిశాస్త్రి ఫిక్స్!
Ravi Shastri

Updated on: Aug 16, 2019 | 7:38 PM

టీమిండియా కోచ్ ఎంపిక దాదాపు పూర్తయ్యింది. మరోసారి ప్రస్తుత కోచ్ రవిశాస్త్రికే పదవి దక్కింది. ఆరుగురిని ఇంటర్వ్యూలకు పిలిచిన కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ… చివరకు శాస్త్రినే కోచ్​గా ఎంపికచేస్తూ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.

భారత కెప్టెన్ కోహ్లీ మొదట్నుంచి రవిశాస్త్రికే ఫేవర్‌గా ఉన్నాడు. తాజా నిర్ణయంతో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్ మూడీ, మైక్ హెసన్, రాబిన్ సింగ్​, లాల్​చంద్ రాజ్​పుత్​లకు నిరాశే మిగిలింది. జట్టుతో పనిచేయడం రవిశాస్త్రికిది నాలుగోసారి. ఇంతకుముందు 2007లో బంగ్లాదేశ్ టూర్​కు మేనేజర్​గా, 2014-16 టైంలో టీం డైరెక్టర్​గా, 2017-19  హెడ్​ కోచ్​గా పనిచేశాడు. ​కోచ్ పదవికి పోటీపడిన మిగిలిన వారితో పోలిస్తే రవిశాస్త్రి రికార్డు మెరుగ్గా ఉండటం అతడికి కలిసొచ్చింది.