రషీద్‌ఖాన్ మ్యాజిక్…ఆఫ్గనిస్థాన్ చారిత్రాత్మక విజయం

|

Sep 10, 2019 | 5:04 AM

పసికూన ఆఫ్గనిస్తాన్‌..గతేడాది టెస్టు హోదా పొందిన జట్టు.  అనూహ్య విజయాన్ని నమోదు చేసి..టెస్టుల్లో రెండో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచులో ఆఫ్గన్ జట్టు 224 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్‌ ఫిక్స్ చేసిన 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించంలో బంగ్లాదేశ్ తడబడింది. ఆఫ్గన్ బౌలర్లు వీర విజృంభణతో బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. కేవలం 173 పరుగులకే అలౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అఫ్గాన్‌ బౌలర్, కెప్టెన్‌ […]

రషీద్‌ఖాన్ మ్యాజిక్...ఆఫ్గనిస్థాన్ చారిత్రాత్మక విజయం
Rashid Khan Takes Afghanistan Close to Historic First Victory Against Bangladesh
Follow us on

పసికూన ఆఫ్గనిస్తాన్‌..గతేడాది టెస్టు హోదా పొందిన జట్టు.  అనూహ్య విజయాన్ని నమోదు చేసి..టెస్టుల్లో రెండో విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచులో ఆఫ్గన్ జట్టు 224 పరుగుల భారీ తేడాతో అద్భుత విజయం సాధించింది. ఆఫ్గనిస్తాన్‌ ఫిక్స్ చేసిన 398 పరుగుల లక్ష్యాన్ని ఛేదించంలో బంగ్లాదేశ్ తడబడింది. ఆఫ్గన్ బౌలర్లు వీర విజృంభణతో బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. కేవలం 173 పరుగులకే అలౌటయ్యారు.తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన అఫ్గాన్‌ బౌలర్, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (6/49) రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆతిథ్య బంగ్లాను చుట్టేశాడు..అతనితో పాటు మరో బౌలర్ జహీర్ ఖాన్ సైతం మూడు వికెట్లు పడగొట్టడం విశేషం. దీంతో బంగ్లాదేశ్ డ్రా దిశగా కూడా నిలబడలేకపోయింది. అప్పుడప్పుడు అడ్డతగిలిన వర్షం కూడా వారి అపజయాన్ని అడ్డుకోలేకపోయింది.

ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన రషీద్‌ఖాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు.వర్షంతో సోమవారం ఆట ఓ పట్టాన మొదలే కాలేదు. తొలి సెషన్‌ పూర్తిగా తుడిచి పెట్టింది. కేవలం 2.1 ఓవర్ల ఆటే జరిగాక మళ్లీ వర్షం ముంచెత్తడంతో రెండో సెషన్‌ కూడా నిండా మునిగింది. ఈ దశలో ఆతిథ్య బంగ్లా శిబిరం సంబరంగా ఉంది. కానీ వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఇక డ్రా తప్పదేమో అనుకున్న దశలో ఆఖరి సెషన్‌ మొదలైంది. కేవలం 18.3 ఓవర్ల ఆటే మిగిలింది. ఈ మాత్రం ఓవర్లను ఆడేయలేమా అన్న ధీమాతో బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌కు దిగింది. అయితే అఫ్గాన్‌ బౌలర్లు 17.2 ఓవర్ల వ్యవధిలో నాలుగు వికెట్లు తీశారు. 61.4 ఓవర్లలో 173 పరుగుల వద్ద బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను ముగించి విజయాన్ని అందుకున్నారు.