Afghanistan Spinner Rashid Khan: రషీద్ ఖాన్‌కు అసాధ్యం కానిదంటూ ఏమీలేదనడం అతిశయోక్తి లేదు. 22 ఏళ్ల ఈ ఆఫ్ఘన్ క్రికెటర్ ఇప్పటికే తానేంటో ప్రపంచ క్రికెట్‌కు చాటి చెప్పాడు. అత్యత్తమ స్పిన్నర్‌గా గుర్తింపు పొందిన రషీద్ ఖాన్.. బౌలింగ్‌కు మించి మంచి బ్యాట్స్‌మెన్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. కుడిచేతితో బ్యాటింగ్ చేసే రషీద్.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. లాహోర్ ఖలందర్ టీమ్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్.. అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. పెషావర్ జల్మీతో జరిగిన పోరులో లాహోర్ ఖలందర్ తరఫున రషీద్ ఖాన్ బ్యాటింగ్ చేశాడు. ఆ సందర్భంగా. రషీద్ ఖాన్ కొట్టిన ఒక షాట్.. ఇప్పుడు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తోంది. రషీద్ ఖాన్..‘హెలికాప్టర్’ స్వీప్ షాట్ సిక్సర్ కొట్టాడు. ఈ షాట్ గురించి పాకిస్తాన్ సూపర్ లీగ్ యాజమాన్యం తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘చాలా స్టైలీష్ బ్యాటింగ్’ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
ఇదిలాఉంటే, బ్యాటింగ్ స్టైల్‌పై ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్, బ్యాటింగ్ లెజెండ్ సారా టేలర్ స్పందించింది. ‘ఈ బ్యాటింగ్ స్టైల్ నాకు కూడా నేర్పించాలి’ అంటూ కామెంట్ చేసింది. దీనికి రషీద్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యాడు. ‘ఖచ్చితంగా నేర్పిస్తాను’ అంటూ సమాధానం ఇచ్చాడు.
Sarah Taylor Tweet:
Teach me ? https://t.co/1xOveQ7ihO
— Sarah Taylor (@Sarah_Taylor30) February 21, 2021
Also read:
ముంబైలో రానున్న 12 రోజులు కీలకం.. మళ్లీ జోరు పెంచిన చైనా వైరస్.. ఆ ఐదు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది..
కృతిశెట్టి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అభినందన లేఖ.. ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్న హీరోయిన్