PV Sindhu: డ్యాన్స్‌లోనూ అదుర్స్‌ అనిపిస్తోన్న పీవీ సింధు.. మెగాస్టార్‌ పాటకు ఎలా స్టెప్పులేసిందో చూశారా?

|

Feb 16, 2023 | 1:31 PM

హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ మెరుపులు మెరిపిస్తోంది. ఓవైపు బ్యాడ్మింటన్‌ కోర్టులో సంచలనాలు నమోదు చేస్తోన్న ఈ స్టార్‌ ప్లేయర్‌ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్ గా ఉంటోంది.

PV Sindhu: డ్యాన్స్‌లోనూ అదుర్స్‌ అనిపిస్తోన్న పీవీ సింధు.. మెగాస్టార్‌ పాటకు ఎలా స్టెప్పులేసిందో చూశారా?
Pv Sindhu
Follow us on

హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఆటలోనే కాదు డ్యాన్స్‌లోనూ మెరుపులు మెరిపిస్తోంది. ఓవైపు బ్యాడ్మింటన్‌ కోర్టులో సంచలనాలు నమోదు చేస్తోన్న ఈ స్టార్‌ ప్లేయర్‌ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్ గా ఉంటోంది. తనకు సంబంధించిన పర్సనల్ విషయాలతో పాటు కెరీర్‌ విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే బ్యూటిఫుల్‌ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది. అప్పుడప్పుడూ సినిమా పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆ వీడియోలను పంచుకుంటుంది. తాజాగా మరోసారి తన డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ను చూపించింది సింధు. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని ‘బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ’ హుషారుగా స్టెప్పులేసింది. ఈ సందర్భంగా బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ లెహంగాలో ఎంతో స్టైలిష్‌గా కనిపించింది సింధు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

పీవీ సింధు షేర్‌ తన డ్యాన్సింగ్‌ వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోపే 2.5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. అలాగే వేలాది కామెంట్లు వచ్చాయి. ‘ సింధూ.. మీ డ్యాన్సింగ్‌ ట్యాలెంట్‌ అదుర్స్‌..నిన్ను త్వరలోనే టాలీవుడ్‌లో చూడాలనుకుంటున్నాం’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల సింధు డ్యాన్స్‌లు, ఫొటోషూట్‌లు చూస్తుంటే సినిమా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తుందా అనే అనుమానాలు కూడా వచ్చాయి. అయితే వీటిని కొట్టిపారేసిందీ బ్యాడ్మింటన్‌ స్టార్‌. తన ధ్యాసంతా ఆటపైనే ఉందంటూ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..