AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్కార్‌ మాటలు నీటిమీద రాతలేనంటున్న స్టార్‌ బాక్సర్‌

పాలకుల వాగ్దానాలను రాజముద్ర పడిన ప్రభుత్వ ఆదేశాల్లాంటివని భ్రమపడిన స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఇప్పుడు ఆవేదన చెందుతోంది.. పంజాబ్‌ సర్కార్‌ ఆమెకు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలాలయ్యాయట! ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నెరవేర్చలేదట!

సర్కార్‌ మాటలు నీటిమీద రాతలేనంటున్న స్టార్‌ బాక్సర్‌
Balu
|

Updated on: Aug 26, 2020 | 2:30 PM

Share

పాలకుల వాగ్దానాలను రాజముద్ర పడిన ప్రభుత్వ ఆదేశాల్లాంటివని భ్రమపడిన స్టార్‌ బాక్సర్‌ సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఇప్పుడు ఆవేదన చెందుతోంది.. పంజాబ్‌ సర్కార్‌ ఆమెకు ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలాలయ్యాయట! ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నెరవేర్చలేదట! టోక్యో ఒలింపిక్స్‌ కు అర్హత సంపాదించిన ఈ బాక్సర్‌కు అయిదు నెలల కిందట అమరీందర్‌సింగ్‌ ఎన్నో హామీలు ఇచ్చారట! ఓ ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పుకుని తెగ బాధపడింది సిమ్రన్‌ జిత్‌ కౌర్‌..అదే టిక్‌టాక్‌ స్టార్లకైతే వెంటనే ఆర్థిక సాయం చేతికందుతోందన్న విమర్శ కూడా చేశారామె! ఇప్పటికైనా తనకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆర్ధిక కష్టాలతో ఉన్నానని ప్రభుత్వానికి విన్నవించుకుంది. అసలు పంజాబ్‌ ప్రభుత్వం ఏ విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆర్ధికసాయం అందిస్తున్నదో అర్థం కావడం లేదని సిమ్రన్‌ చెప్పుకొచ్చింది. సిమ్రన్‌జిత్‌ కౌర్‌ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడంతో మీడియా ద్వారా ఆమె ఆర్ధిక పరిస్థితిని తెలుసుకున్నారు ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌.. అప్పుడే అయిదు లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు.. జనవరిలో జరిగిన ముచ్చట ఇది! ఎనిమిది నెలలు గడుస్తున్నా ఆ హామీలు ఇంకా కార్యరూపం దాల్చలేదు..

Follow Us
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
60 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. 14 ఏళ్ల చిన్న అమ్మాయితో స్టార్ హీరో
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
అందుకే కోహ్లీకి ఇండియాలో ఉండటం ఇష్టంలేదు: లివింగ్‌స్టోన్
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
సింగపూర్ నుంచి కన్నవారిని చూసేందుకు వస్తే.. విధి ఆడిన వింత నాటకం
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
తుపాకీ వదిలి పుస్తకం పట్టి.. 60 ఏళ్ల వయసులో లాసెట్‌లో అదరగొట్టిన
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
Viral Video: మద్యం మత్తులో ఫారెనర్ యవ్వారం మాములుగా లేదుగా..
శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు..
శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే చాలు.. అష్ట ఐశ్వర్యాలు..
అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో..
అప్పుడు షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. ఇప్పుడు ఇండస్ట్రీలో..
కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..
కృష్ణవంశీ ఈ అమ్మాయిని హీరోయిన్‏గా తీసుకున్నాడు ఏంటీ అన్నారు..
దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్
దూసుకొస్తున్న నిద్రపట్టని అదృష్టం.. గురు-శుక్ర యుతితో బంపర్ లక్
ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు! చేతులు జోడించి చెప్పిన
ఖాన్ సర్ ఇంటిని ముట్టడించిన విద్యార్థులు! చేతులు జోడించి చెప్పిన